శ్రీ నారాయణపురం మహావిష్ణు దేవాలయం అదూర్ లో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక స్ధలం. ఈ దేవాలయం అదూర్ పట్టణానికి 5 కి.మీ.ల దూరంలోని సుందరమైన ఒక గ్రమం పేరు మననకాల లో ఉంటుంది. శ్రీనారాయణపురం మహావిష్ణు దేవాలయం చాలా ప్రాచీనమైనది దీనిలో విష్ణుమూర్తి ప్రధాన దైవం.
ఈ దేవాలయం పండుగల సీజన్ లో కేరళలోని వివిధ ప్రాంతాలనుండి భక్తులను ఆకర్షిస్తుంది. దేవాలయంలో దశావతార చార్తు పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ ప్రతి ఏటా 10 రోజులపాటు నిర్వహిస్తారు. ప్రతి రోజూ దశావతారాలలో ఒక అవతారం వేస్తారు. దశావతారం పండుగ కారణంగానే ఈ దేవాలయం పర్యాటకులలో మరియు భక్తులలో ఎంతో ప్రసిద్ధి గాంచింది. దేవాలయం, నిశ్శబ్దంగా, ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఒక్క సారి దేవాలయం సందర్శిస్తే చాలు, మీలోని భక్తి పొంగి పొర్లుతుంది.