సెయింట్ మేరీస్ ఆర్ధోడాక్స్ సిరియన్ కేధడ్రల్ చర్చి అదూర్ పట్టణానికి 15 కి.మీ.ల దూరంలో కలదు. ఇది చాలా ప్రాచీనమైనది. ఇది తుంపమాన్ గ్రామంలో ఉండటంచే దీనిని తుంపామాన్ వలియాపల్లి అని కూడా అంటారు. నజరేనే క్రైస్తవులనే ఒక ప్రాచీన తెగ శతాబ్దాల వెనుక ఇక్కడకు వచ్చి స్ధిర పడి ఈ చర్చిని ఏర్పరచుకొని ఆరాధిస్తోందని చెపుతారు. ఇది ఇక్కడి వారు భావించేదైనప్పటికి దీనికి చారిత్రక ఆధారాలు లేవు.
చరిత్ర మేరకు ఈ చర్చిని క్రీ.శ. 717 సంవత్సరంలో నిర్మించారు. జెరూసలేం నుండి తిరిగి వచ్చిన పరుమాల కొచ్చు తిరుమేని ఈ చర్చికి ది లిటిల్ జెరూసలేం చర్చి అని బిరుదునిచ్చాడు. ఈ చర్చి మాలంకార ఆర్ధోడాక్స్ సిరియన్ చర్చి క్రిందగల తుంపమాన్ డయాసెస్ కు ప్రధాన కార్యాలయంగా ఉంది. ఈ చర్చి కేరళలోని ప్రాచీన చర్చిలలో ఒకటి. కేరళ రాష్ట్ర మతపర చరిత్రకు ఒక విశిష్టత కల్పిస్తోంది.