పిల్లలు ఆడుకోడానికే కాకుండా శకుంతలా రోడ్ లో వున్న పిల్లల పార్కు ఎక్జిబిషన్ లకు, పార్టీలకు కూడా ప్రసిద్ధమే. ఈ పార్కు ఒక విశాలమయిన ప్రాంతంలో వుండి ప్రతి రోజూ కొన్ని ఈవెంట్లను నిర్వహిస్తుంది.
పిల్లల పార్కులో గిఫ్ట్ ఆర్టికల్స్, లైటింగ్, ఆక్సేస్సరీలు లాంటి సాధ్యమైన అన్ని విషయాలకు వార్షికంగా ఎగ్జిబిషన్ లు జరుగుతూనే వుంటాయి. ఇక్కడ అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ లు కూడా జరుగుతుంటాయి. వస్త్రాలు, వ్యవసాయం, చివరికి పెళ్ళిళ్ళ వరకు కూడా అన్ని రకాల ఫెయిర్ లు ఇక్కడ నిర్వహిస్తారు. త్రిపుర ప్రభుత్వం కూడా రాష్ట్ర కళా సంస్కృతులను అభివృద్ది చేయడానికి ఈ మైదానాన్ని ఉపయోగిస్తుంది.
పిల్లల పార్కు నగరంలోనే వుంది కనుక ఇక్కడికి బస్సులు, టాక్సీలలో తేలిగ్గానే చేరుకోవచ్చు. ఈ రూట్ లో చాలా బస్సులు తిరుగుతాయి, పర్యాటకులు వాటిని ఉపయోగించుకోవచ్చు. అదృష్టం బాగుంటే ఇక్కడ ఎప్పుడూ జరిగే ఏదో ఒక అంతర్జాతీయ ఫెయిర్ ను కూడా చూడవచ్చు.