హరప్పన్ నాగరికత శిధిలాలు కనబడే ప్రదేశం లోథాల్. లోథాల్ అనగా "శిధిలమైన మట్టిదిబ్బ" అని అర్ధం. ఈ నగర నిర్మాణం యొక్క ఖచ్చిత ప్రణాళిక లు తెలియచేస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడున్న ప్రాచీన సమాజం, నిర్మాణం అలాగే ఆర్ధిక వ్యవస్థల పై లోథాల్ మనకి కొంత సమాచారం అందిస్తుంది. అలాగే ఇక్కడ కనబడే హస్త కళా కృతులు ఈ ప్రాంతం యొక్క సంస్కృతీ సంప్రదాయాలని అర్ధం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఎన్నో వరదల కి గురి అయిన ఈ ప్రాంతం నాలుగవ వరదకి తట్టుకోలేక అంధకారం లో మునిగిపోయింది.