Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఐజావాల్

ఐజావాల్ -పీటభూమి ప్రజలు !

17

ఐజవాల్ భారత దేశం లోని ఎనిమిది రాష్ట్రాల లో ఒకటి అయిన మిజోరం రాజధాని. ఐజ్వాల్ ఒక అందమైన నగరం, ఎత్తైన ప్రదేశాలు, కొండలు వాలీ లు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. వంద సంవత్సరాల చరిత్ర కల ఈ సిటీ సముద్ర మట్టానికి 1132 మీటర్ల ఎత్తున వుంది. దీనికి ఉత్తర దిశగా దుర్ట్లాంగ్ శిఖరాలు ఎంతో హుందాగా నిలబడి వుంటాయి. ఐజ్వాల్ అందాలను పెంచుతూ ఈ సిటీ వెనుక భాగం లో ట్లవాంగ్ నది ప్రవహిస్తూ వుంటుంది. ఈ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. బహుళ అన్తుస్తుల భవనాలు వెలుస్తున్నాయి. మిజోరం లో వేగంగా పెరిగే ఈ నగరానికి మౌలిక వసతుల అవసరం ఎంతైనా వుంది.

మిజో ల భూమి

మిజోరం అంటే అర్ధం మిజోల భూమి అని చెపుతారు. మిజో లు అంటే ఎత్తు ప్రాంతాలలో నివసించే వారు అని అర్ధం చెపుతారు. దేశం లో చిన్నదైన ఈ రాష్ట్రం ఒక వైపు మయన్మార్, బంగ్లాదేశ్ ల తోను, మరో వైపు దేశం లోని ఇతర రాష్ట్రాలైన, అస్సాం, త్రిపుర, మణిపూర్ లతో సరి హద్దులు పంచుకోండి. 1987 లో ఒక రాష్ట్రం గా కేంద్ర పాలిత ప్రాంతం గా ఏర్పడింది. మిజోలు మంగోలియన్ జాతికి చెందినా వారు. అనేక శతాబ్దాలనుండి ఇక్కడ నివసిస్తున్నారు.

మిజో ల సంస్కృతి సంప్రదాయాలు

మిజో లు సంప్రదాయకంగా వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తారు. ఝూం సాగు వీరి పద్ధతి. వీరికి మిం కూత మరియు పవల్ కూత అనే రెండు సాగు పండుగలు కలవు. ఈ పండుగలను వీరు ఆగష్టు - సెప్టెంబర్ మరియు డిసెంబర్ - జనవరి లలో జరుపుకుంటారు. మిజో లు ప్రత్యేకించి వెదురు బద్దలు ఉపయోగించి చేసే చేరా డాన్స్ లో ప్రసిద్ధి. ఈ సాంస్కృతిక అంశాలు ఐజ్వాల్ ను పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ఐజవాల్ లోను చుట్టుపట్ల కల టూరిస్ట్ ప్రదేశాలు

ఒక కోట వాలే వుండే ఐజ్వాల్ లో అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. చుట్టూ పట్ల కూడా అనేక పర్యాటక ప్రదేశాలు కలవు. ఇక్కడ కల ట్లావంగ్ నది పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఐజవాల్ కు పడమటి భాగాన ఈ నది ప్రవహిస్తూ, తూర్పు దిశగా మరో నది తురియాల్ రివర్ ప్రవహిస్తూ, సిటీ కన్నుల పండువగా వుంటుంది.

తాం దిల్ సరస్సు లో బోటింగ్ ప్రధాన ఆకర్షణ. మీరు ఫిషింగ్ చేసేవారైతే, ఛిమ్తుఇపుఇ నది సరైన విహారం. ఇక్కడ కల మిజోరం లో ఎత్తైన వాటర్ ఫాల్ సుమారు 750 అడుగుల ఎత్తునుండి పడుతూ పర్యాటకులను ఆశ్చర్య పరుస్తుంది. మిజోరం లో అతి ఎత్తైన సిఖిరం ఫవాన్ పూయి శిఖరం. ఇది తోటలకు, పెద్ద పెద్ద ఎలుకలు, పండి కొక్కులకు , కొండ మేకలకు, సీతాకోక చిలుకలకు ప్రసిద్ధి.

ఐజవాల్ ఒక రాష్ట్ర రాజధాని గానే కాక రాష్ట్ర సంస్కృతికి కూడా కేంద్రంగా వుంటుంది. మిజోరం స్టేట్ మ్యూజియం, సోలమన్ టెంపుల్, ట్విన్ లేక్ అఫ్ ఐజవాల్, రున్గ్దిల్ వంటివి మరి కొన్ని పర్యాటక ఆకర్షణలు.

ఐజవాల్ కు సమీపం లో రేలేక్ అనబడే ఒక చిన్న కల్చరల్ విలేజ్ కలదు. ఈ విలేజ్ లో టూరిస్ట్ లు మిజోల ప్రత్యేకత అయిన వారి గుడిసెలు, సహజ ఫారెస్ట్ లు, కొండ కోణాలు వంటివి ప్రదర్శనలో వుంటాయి.

ఐజవాల్ ఎలా చేరాలి ?

ఐజవాల్ కు కోలోకటా, గౌహతి ల నుండి డైలీ ఫ్లైట్ లు కలవు. సమీప రైలు స్టేషన్ సిటీ కి 184 కి. మీ. ల దూరం లో కల సిల్చార్ లో కలదు. ఈ నగరాన్ని నేషనల్ హై వే 54 దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది.

వాతావరణం

ఐజవాల్ లో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది. వేసవులు, వింటర్ లు కూడా ఒక మోస్తరు గా వుండి సౌకర్యం గా వుంటుంది. వేసవి లో ఉష్ణోగ్రతలు 20 - 29 డిగ్రీల మధ్య మారుతూ వింటర్ లో 7 డిగ్రీలకు పడతాయి. ఐజవాల్ లో వార్షిక సగటు వర్షపాతం 254 సెం. మీ. లు గా వుంటుంది.

ఐజావాల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఐజావాల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఐజావాల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఐజావాల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం నేషనల్ హై వే 54 మార్గం పై దేశం లోని ఇతర భాగాల నుండి ఐజవాల్ చేరవచ్చు. ఈ హై వే సిల్చార్ గుంటా ప్రయాణిస్తూ ఐజ్వాల్ ను షిల్లాంగ్ కు మరియు గౌహతి కి కలుపుతుంది. షిల్లాంగ్ , సిల్చార్ లనుండి రెగ్యులర్ ప్రభుత్వ బస్సు లు కలవు. ప్రైవేటు బస్సు లు కూడా ఈ మార్గం లో కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఐజవాల్ కు సమీప రైలు స్టేషన్ సిల్చార్ అంటే దక్షిణ అస్సాం ప్రాంతం లో కలదు. ఇది 180 కి. మీ. ల దూరం. సిల్చార్ నుండి గౌహతి కి లుం డింగ్ ద్వారా చేరవచ్చు. సిల్చార్ నుండి ఐజవాల్ కు రోడ్డు ప్రయాణ సౌకర్యాలు కలవు. టూరిస్ట్ లు ప్రైవేటు టూరిస్ట్ వెహికల్స్ కూడా పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఐజవాల్ లోని స్తాని ఎయిర్ పోర్ట్ లెంగ్ పోఇ ఎయిర్ పోర్ట్ . ఇక్కడ నుండి గౌహతి మరియు కోల్కతా లకు డైలీ విమానాలు కలవు. ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే కాక అనేక ఇతర ప్రైవేటు విమాన సంస్థలు కూడా సేవలు అందిస్తున్నాయి. సిటీ కి 35 కి. మీ. ల దూరం లో కల ఎయిర్ పోర్ట్ నుండి తరచు వాహనాలు నడూస్తూ వుంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat