Search
  • Follow NativePlanet
Share

అజంతా - ప్రపంచ వారసత్వ సంపద

16

అజంతా గుహలు సుమారు క్రీ.పూ. 2వ శతాబ్దం నాటివి. ఆనాడు కల హిందు, బౌధ్ధ మరియు జైనమతాలకు ఈ గుహలు ధృవపత్రాలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరం ఔరంగాబాద్ కు సమీపంలోని అజంతా గుహలను వాటి పక్కనే కల ఎల్లోరా గుహలను యునెస్కో సంస్ధ అతి ప్రధానమైన చారిత్రాత్మక ప్రదేశాలుగా ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించింది. స్పష్టపరచిన బుద్ధుడి జీవితం అజంతా లో 30 గుహలు ఉన్నాయి. వీటిలో మూడు మతాలకు సంబంధించిన పెయింటింగులు, శిల్పాలు,  చెక్కడాలు కలవు. వీటి గోడలు అన్నీ క్రీ.పూ. 2వ, 6వ మరియు 7వ శతాబ్దాలనాటి చరిత్రను చాటుతాయి. ఈ గుహలు అన్నీ కూడా గౌతమ బుద్ధుడు దివ్యత్వం పొందిన ముందు జీవిత వాస్తవాల వివరాలను వెల్లడి చేస్తాయి. శ్రీలంక దేశంలో కనుగొనబడిన సిగిరియ గుహలకు ఈ గుహలు అత్యధిక సామీప్యతను కలిగి ఉంటాయి.

ఈ గుహలను తయారు చేయటానికిగాను సుమారుగా 800 సంవత్సరాలు పట్టి ఉండవచ్చని విశ్వసిస్తారు. 19వ శతాబ్దంలో కొంతమంది బ్రిటీష్ సైనికులు హార్స్ షూ రాక్ ను కనిపెట్టారు. దానిని చూడగానే మరింత ఆసక్తితో పరిశోధించి ఆ ప్రాంతంలో దట్టంగా వున్న పచ్చదన్నాన్ని అక్కడి గుహల సముదాయాన్ని వెంటనే చూడగలిగారు. ప్రభుత్వానికి వెంటనే సమాచారం అందించారు. ప్రభుత్వం పురావస్తు పరిశోధకుల బృందాన్ని నియామకం చేసి అద్భుతమైన ఈ గుహలను ప్రపంచానికి వెల్లడి చేసింది.

పురావస్తు శాఖ పరిశోధనలో బౌధ్ధ మతానికి చెందిన అనేక స్తూపాలు, తారాలు, ద్వారపాలురు, విహారాలు, చైత్యాలు మరియు వాటితో పాటు అనేక పెయింటింగులు, ఇతర చారిత్రక ఆధారాలు కనుగొనబడ్డాయి. పెయింటింగ్ లు అన్నీ కూడా పూర్తిగా బుద్ధుడి జీవితానికి మరియు బౌద్ధ మతానికి చెందిన ఆధారాలే.  

ఈ ప్రాంతం చేరిన మీకు గుహలు ఏమి చూపుతాయి? అజంత మరియు చుట్టుపట్ల ప్రదేశాలు చూపుతాయి.

ఈ గుహలు మొత్తంగా 29 వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా విశేషమైన బుద్ధుడి జీవిత గాధలు చూపుతుంది.

మొదటి గుహ అంటే కేవ్ 1 లో 6వ మరియు 7వ శతాబ్దాలనాటి వివరాలుంటాయి. అనేక ప్రధాన చిహ్నాలు లేదా గుర్తులు, పెయింటింగ్ లు గుహలో కలవు. ప్రవేశ మార్గంలో మహానీయుడు బుద్ధుడి రూపం వివిధ భంగిమలలో కనపడుతుంది. 20 వ గుహలో వలెనే నాగాలు సంరక్షకులుగా కనపడతారు. మీరు కనుక పైభాగంలో ఎడమవైపు మూలమీద చూసినట్లయితే, అక్కడ ఒక దేవతా విగ్రహ చెక్కడం కనపడుతుంది. ఆమెను భూదేవి మరియు ప్రాణాధార నీటికి ప్రతిరూపంగా భావిస్తారు. మరుగుజ్జు దేవదూతలు చేతిలో పూలమాలతో బుద్ధుడికి వేయు చెక్కడాలు  కనపడతాయి. మరోవైపు పద్మపాణి అవకితేశ్వర ఒక పద్మాన్ని పట్టుకుని కనపడతాడు. మరోవైపు పిడుగును పట్టిన వజ్రపాణి రూపం ఉంటుంది. వీరిద్దరూ కూడా బోధిసత్వలో ఒక భాగంగా ఉంటారు. ఒకే తల కల నాలుగు జింకలు కూడా కనపడతాయి.

కామవాంఛలు తప్పు కాదనే చూపే ప్రేమికులు, నల్లని రాజకుమార్తె, ఆంధ్ర దేశం నుండి వచ్చిన వాస్తవ రాజకుమార్తె,  స్తంభానికి ఆనుకుని నిలబడే రాజకుమార్తె, నాట్యకారిణి, బాధ పడుతున్న ఒక పనిమనిషి మరియు పర్షియా దేశపు దౌత్య కార్యాలయం బొమ్మలు ఈ గుహలో కనపడతాయి. బంగారు బాతులు, లేత ఎరుపు రంగు లేదా పింక్ రంగు ఏనుగు,  ఎద్దుల పోరాట ప్రదర్శన వంటి బొమ్మలు, జీవులు అన్నీ ఒకటే అనే సందేశాన్ని ఇస్తాయి.

2వ గుహ సందర్శన మొదటి గుహకంటే కూడా బాగుంటుంది. ఈ గుహలోని ద్వార బంధాలు భారతదేశంలోని అనేక ప్రాచీన దేవాలయాల ద్వార బంధాలను గుర్తు చేస్తాయి. సీలింగు భాగం విస్తారంగా అలంకరించబడి ఉంటుంది. లోపలి గోడలపై వేలాది బుద్ధుడి రూపాలు ఆశ్చర్యకర వివరాలను కలిగి ఉంటాయి. కుడివైపు మార్గంలో బలమైన ఒక బాలిక ఊయలపై కూర్చుని ఉంటుంది. దీనిని ఊయలపై స్త్రీ అంటారు. ఈ చిత్రం బుద్ధుడి ఆలోచన అయిన ...శారీరక శక్తి ఎంతో ప్రకాశాన్ని ఇస్తుంది అనే అంశాన్ని తెలియజేస్తుంది.

4వ గుహ కూడా 17వ గుహ మాదిరిగా ఉంటుంది. అయితే దీనిని పూర్తి చేయలేదు. ఇక్కడ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అనేక అసంపూర్తి పెయింటింగ్ లు కనపడతాయి. వంగి కూర్చొని వున్న జింక, మరుగుజ్జు సంగీతకారుడు, పూలగుత్తులు వంటివి ఈ గుహలో కనపడతాయి.

6వ గుహ మహాయాన బౌద్ధమత కాలాన్ని తెలియజేస్తుంది. దీనిలో కూర్చుని వున్న బుద్ధుడు ఆయన చుట్టూ ఎగురుతున్న జంటలు కనపడతారు. ఈ గుహలోని స్తంభాలు ముందు గుహలకంటే కూడా నాణ్యత కలిగి అష్ట భుజాలు కలిగి ఉంటాయి. దీనిలో పద్మంతో కూడిన బిక్షువు పెయింటింగ్ ఉంటుంది. 9వ గుహలో చైత్యహాలు సమావేశం చూపబడుతుంది. దీనిలో ఒక పెద్ద హార్స్ షూ విండో ఉంటుంది.  నాగులను పూజించేవారు మరియు జంతువుల గొంగళి, మరియు, పశువుల కాపరుల పెయింటింగులు నేటికి ఇక్కడ కనపడుతూనే ఉంటాయి.  

10వ గుహ  శైలిలోను నిర్మాణంలోను 9వ గుహనే పోలి ఉంటుంది. దీనిలో జాతక బుద్ధుడు ఒక ఏనుగు అవతారంలో ఉంటాడు. శ్యామ జాతక మరియు ఒక రాజు తన సైన్యంతో ఉంటారు. రాజకుమారి మరియు ఏనుగు దంతం, ఒంటి కన్ను బౌద్ధ సన్యాసితో బుద్ధుడు, మరి కొన్ని పెయింటింగ్ లు కూడా ఉంటాయి.

11వ గుహ ప్రధానంగా హీనయాన కాలం నుండి మహాయాన కాలంకు వచ్చే మార్పులు చూపుతుంది. దీనిలో బౌద్ధ స్తూపాలు ఉంటాయి.  అందమైన వాకిటి తలుపులు, ద్వార బంధాలు కనపడతాయి. ఈ గుహ అచ్చెరువొందే నదీ దృశ్యాన్ని కూడా కింద చూపుతుంది. ఈ గుహలో పెద్ద బుద్ధుడి విగ్రహం, బుద్ధుడు ఒక బిక్ష పాత్రను పట్టుకుని వుండటం, బుద్ధుడు రాజకుమారుడుగా, రాజకుమారుడుగా బుద్ధుడు విల్లు ఎక్కు పెట్టటం వంటివి కనపడతాయి. ఈ గుహ ప్రపంచ ప్రఖ్యాత కళలకు పుట్టిల్లుగా ఉంటుంది. తన భర్త సన్యాసి అయిపోతున్నాడని తెలుసుకుని మరణానికి సిద్ధపడే రాజకుమారి, సూతసమ జాతక మరో శిల్పంగా కనపడుతుంది. దీనిని తప్పక చూసి దీరాల్సిందే.

17వ గుహలోని చిత్రాలు ప్రేమను చూపుతాయి. అప్సరసలు, విహరిస్తున్న ఆత్మలు, ఇంద్రుడు మరియు అప్సరసలు, దేవదూతలు ఉంటాయి. రాజకుమారుడైన సిద్ధార్ధుడు బౌద్ధ సన్యాసి అయి మరోమారు తన భార్యను, పిల్లలను కలుసుకొని వారిని రాజీ చేస్తున్న సంఘటనలు కూడా చిత్రాలుగా చూపబడ్డాయి.

21వ గుహ ఇతర గుహలకంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో చక్కగా మలిచిన స్తంభాలుంటాయి. ఒకప్పుడు దీని గోడలకు వేలాడిన చిత్రాలు  ఇపుడు అతికించబడ్డాయి.

ఈ గుహలో చైత్య హాల్ అనబడే పురజనుల బహిరంగ సభ వరండా దగ్గరలో ఉంటుంది. ఈ నిర్మాణంలో అనేక తోరణాల ఆర్చీలు ఉంటాయి. ఇవి 26 స్తంభాలపై నిలపెట్టబడి ఉంటాయి. గోడకు కొన్ని శిల్పాలు ఉంటాయి. వరండాకుగల గోడపై బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అది ఇపుడు శిధిలావస్ధలో ఉంది. దానిని నిద్రిస్తున్న బుద్ధుడిగా భావిస్తారు. అయితే బౌద్ధ సన్యాసులు దానిని బుద్ధుడి నిర్వాణ దశగా భావిస్తారు. ఇక్కడే కోర్కె కల బుద్ధుడి శిల్పం కూడా ఒకటి కనపడుతుంది.

24వ గుహ లో 3 భాగాలుంటాయి.  స్తంభాలు, గోడలు, వాకిలి ద్వారబంధాలు ఉంటాయి. స్తంభాల శైలి అసంపూర్తిగా ఉంది. కాని కట్టడం తీరు అద్భుతం. స్తంభాల కట్టడం మొదటిలో సరిగా లేనప్పటికి  మహాయాన కాలంలో వాటిని అష్టభుజి స్తంభాలుగా చక్కటి నైపుణ్యం కలిగించారు. అయితే, 24వ గుహ అసంపూర్తిగానే ఉండిపోయింది. తర్వాతి కాలం 7వ శతాబ్దంలో వాకిలి ద్వారబంధాన్ని పైభాగంలో కుడి మూలలో ఒక టి ఆకారంలో నిర్మించారు.

26వ గుహ శ్రావస్తి  అద్భుతం కలిగి ఉంటుంది. బుద్ధుడి కుటుంబం, బుద్ధుడి తల రింగుల జుట్టు కలిగి వుండటం చూపుతుంది. గుహలోపలికి వెళ్ళే మార్గం బుద్ధుడు తన కాలంలో చేసిన అద్భుతాలను ప్రదర్శించే చిత్రాలు కలిగి ఉంటుంది.

శ్రావస్తి ఒక గ్రామం. ఈ గ్రామ ప్రజలు ఆకాశంలో బుద్ధుడి వివిధ రూపాలను చూసి ఆనందించినట్లు చెపుతారు. ఆ కాలంలో కుటుంబం అంటే ఎంతో ఆదర్శంగా వుండేవారు. ఈ గుహ పూవుల అలంకరణ కలిగి ఉంటుంది. బుద్ధుడి తల ఉంగరాల జుట్టు కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద చెవులు కలిగి చూపబడుతుంది. బుద్ధుడు విశ్వవ్యాప్త కేంద్రంగా భావించబడే ఒక పద్మంపై కూర్చుని ఉంటాడు. నాగాలు, నంద మరియు అనుంపానంద పద్మం పూవు కాడను పట్టుకొని ఉంటారు. చైత్య హార్స్ షూ ఆర్చి అద్భుతమైన 5వ శతాబ్దపు చిత్రాలను ప్రదర్శిస్తుంది.

27వ గుహలో రెండు భాగాలుంటాయి. అవి నాగ ద్వార పాల మరియు వాకిలి ద్వారబంధం. బుద్ధ క్షేత్రంలో బయటి వైపు నాగ ద్వారపాల. ఈ గుహలో 20వ గుహ శైలి కనపడుతుంది. ఇక్కడి నాగ అక్కడి నాగను పోలి ఉన్నప్పటికి దాని అంత అందంగా కనపడదు.  వాకిలి మార్గం రెండవ గుహరీతి కలిగి ఉంటుంది.

అజంతా గుహలు దర్శించాలంటే సవత్సరంలో ఏ సమయంలో అయినా అనుకూలమే. వాతావరణ పరిస్ధితులతో పని లేదు. అయితే, కొద్దిపాటి నడక ఉంటుంది కనుక వేసవిలో వేడి కారణంగా అసౌకర్యంగా ఉంటుంది. మీకు అలసట కలిగిస్తుంది. ఈ ప్రదేశం చూడాలంటే వర్షాకాలం కూడా మంచి సమయమే. గుహల కింది భాగంలో ఉన్న నది ప్రవహిస్తూ చక్కటి పూర్తి ప్రవాహంతో పచ్చటి పరిసరాలతో మీకు మరచిపోలేని అనుభూతులు కలిగిస్తుంది.  అజంతా గుహలను విమానం, బస్ లేదా రైలుపై తేలికగా చేరవచ్చు. 100 కి.మీ. ల దూరంలో కల ఔరంగాబాద్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.

దేశంలోని వివిధ నగరాలనుండి ఔరంగాబాద్ మరియు జలగాంవ్ లకు రైళ్ళు కలవు. ఇక్కడనుండి అజంతా గుహలు ఎంతో దగ్గర. బస్ పై ప్రయాణించగోరే వారికి ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్ లు లభ్యంగా ఉంటాయి. ఔరంగాబాద్ నుండి అజంతా గుహలు రెండు లేదా మూడు గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు.  

అజంతా గుహల గురించి చదివి ఆనందించేకంటే, వ్యక్తిగతంగా వాస్తవంలో చూసి ఆనందించటం మెరుగు. ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటిగా చేర్చిన ఈ గుహలను మరణానికి ముందు ఏదో ఒక సమయంలో తప్పక చూసి ఆనందించవలసిందే. ఈ ప్రపంచ అద్భుతాలను తప్పక చూడండి. ఈ గుహల అంద చందాలు మిమ్ములను అబ్బుర పరుస్తాయి.

అజంతా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అజంతా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అజంతా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అజంతా

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం అజంతా గుహలకు చక్కటి రోడ్డు మార్గం కలదు. ముంబై, పూనే, షిర్డి, నాసిక్ వంటి నగరాలనుండి వివిధ రకాల బస్సులు నడుస్తాయి. ఔరంగాబాద్ నుండి అజంతాకు రెండు లేదా మూడు గంటల వ్యవధిలో అజంతా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం అజంతా కు రైలు స్టేషన్ లేదు. రైలు ప్రయాణం చేయగోరేవారు ముంబై నుండి తపోవన్ ఎక్స్ ప్రెస్ మరియు దేవగిరి ఎక్స్ ప్రెస్ లలో ఔరంగాబాద్ చేరుకోవచ్చు. జలగాంవ్ కూడా చేరుకోవచ్చు. ఈ రైలు స్టేషన్ అజంతాకు 60 కి.మీ. ల దూరం మాత్రమే.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    అజంతా గుహలను చేరటం ఎలా? విమాన ప్రయాణం ఔరంగాబాద్ విమానాశ్రయం అజంతాకు 100 కి.మీ. ల దూరంలో సమీపంగా ఉంటుంది. ఈ విమానాశ్రయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఢిల్లీ విమానాశ్రయాలకు రోజువారీ రాకపోకలతో అనుసంధానించబడి ఉంది. త్వరలోనే జలగాంవ్ లో కూడా ఒక విమానాశ్రయం రాబోతోంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat