దు-ఖాన్ లేదా అసెంబ్లీ హాలు ఆల్చి భవన సముదాయం మధ్యలో ఉంది.ఈ మఠ సముదాయంలో ఈ హాలు చాలా పురాతనమైనది. ఇక్కడే మట సన్యాసులు అనేక ఉత్సవాలు జరుపుతారు.ఈ హాలు కి అనేక హంగులని 12-13 శతాబ్ద కాలంలో అమర్చారు.దాదాపు ఒక వెయ్యి బుద్ధ చిత్రాలు "ఫ్రెస్కో" శైలి లో కారిడార్ లో చిత్రీకరించబడ్డాయి.
ఈ ఆలయ బయటి ద్వారాం మీద హిందూ మత విశ్వాసం ప్రకారం సమ్హారానికి ప్రతీక అయిన "మహా కాల్" రూపం,శివ రూపం మరియు సంసార చక్రానికి ప్రతీక అయిన "సంసార చక్రం" లేదా "భావ చక్రం" ఉంటాయి. ఈ ఆలయం లో "పంచతద్గతులు" కూడా ఉన్నాయి."వైరోచన" అనబడే దివ్య బుద్ధుడు ఈ ఆలయ ప్రధావ దేవత. ఈ మూల విగ్రహం చుట్టూ ఆరు రకాల మండలాలతో చిత్రీకరించబడ్డ పంచ తద్గతులు ఉన్నాయి.
ఈ మండలాలు బుద్ధ చిత్రాలు మరియు ధర్మ పరిరక్షకులైన "బోధి సత్వులు" ఇతర దేవతల చిత్రాల చుట్టూ అమర్చబడి ఉన్నాయి.