ఆల్చీ మఠ సముదాయం లో గల "సం-త్సెక్" ఆలయం శిల్ప కళా నైపుణ్యానికి ప్రసిద్ధి."సం-త్సెక్" అనగా మూడంతస్తుల భవనము. ఈ భవనాన్ని టిబెట్ సంప్రదాయ శైలిలో సహజ సిద్ధ రాయి మరియు లోహం (ఇసుక,మట్టి మిశ్రమం) అనబడే పదార్ధాలు ఉపయోగించి నిర్మించబడినది. ఈ చిన్న ఆలయం లో నాలుగు చేతులు గల "బోధిసత్వ" విగ్రహాలు చాలా పెద్దవి ఉన్నాయి. ఇవి ఒకొక్కటి 4 మీటర్ల పొడుగు ఉంటాయి."మైత్రేయ"(లాఫింగ్ బుద్ధా)విగ్రహం 4.63 మీటర్ల పొడుగు ఉండి నేల మధ్య భాగంలో అమర్చబడింది.
ఈ విగ్రహానికి ఎడమ పక్క తెల్లటి అవలోకేతేశ్వర బోధిసత్వ విగ్రహం, కుడి పక్క అపార జ్ఞానానికి ప్రతీక అయిన "మనుశ్రీ" బోధిసత్వ విగ్రహాలున్నాయి.