కొలబా కోటను ముంబై వాసులు తరచుగా ఆనందించే కొలబా మార్కెట్ అని భావించకండి. ఈ కొలబా కోట వేరు ప్రదేశంలో సముద్ర తీరంలో కలదు. శివాజీ మహారాజ్ తన జీవితకాలంలో చనిపోయే ముందు నిర్మించిన కోట ఇది. ఒకప్పుడు ఈ కోటలో తీపినీటి బావి ఉండేది. సమీపంలో అనేక దేవాలయాలు కూడా కలవు. వాటి ప్రవేశ ద్వారాలకు వివిధ రకాల ఏనుగుల, పులుల చిత్రాల చెక్కడాలను గమనించవచ్చు. సముద్రపు పోటు అధికంగా లేని సమయంలో బీచ్ నుండి ఈ 3 శతాబ్దాల పురాతన కోటకు కాలిమార్గంలో చేరవచ్చు. అయితే, ప్రభుత్వ పురావస్తు శాఖ కోట ప్రవేశానికి ప్రవేశ రుసుము వసూలు చేస్తుంది.