Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలెప్పి » వాతావరణం

అలెప్పి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయంఎండాకాలంలో వేడి తీవ్రమైనప్పటికీ సాయంత్రం వాతావరణం చల్లగా మారటం వల్ల ఆహ్లాదకరం గా ఉంటుంది. కానీ, శీతాకాలం ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో సెలవులని అలెప్పి లో గడపడం అత్యద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించేందుకు ఈ సమయంలోనే పర్యాటకులు ఎక్కువగా తరలి వస్తారు.  

వేసవి

ఎండా కాలంఅలెప్పి లో ఎండాకాలం మార్చ్ లో మొదలై మే వరకు కొనసాగుతుంది. సముద్రతీరం కావడం వలన గాలిలో తేమ శాతం కూడా ఎక్కువే. ఇక్కడి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ ని దాటి నమోదవవచ్చు. వేడితో సంబంధం లేకుండా, ఇక్కడి వాతావరణం సాయంత్రాలు ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రం మీంచి వీచే చల్లటి గాలి ఎంతో చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.  

వర్షాకాలం

వర్షాకాలం :జూన్ నుండి సెప్టెంబర్ వరకు కేరళలో వర్షాకాలం. ఈ కాలంలో ఎడతెగని వానలు కురుస్తాయి. చిరుజల్లుల నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు కలవు. ఉహించని పరిణామాలు వాతావరణంలో చోటు చేసుకుంటాయి. ఈ సమయం కొంచెం ప్రమాదకరమన సమయం.  

చలికాలం

శీతాకాలంకేరళలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం. చలికాలం లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 18డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. సాహసయాత్రలకి, హనీ మూన్ కి, బ్యాక్ వాటర్స్ అందాలని ఆస్వాదించడానికి, మానసిక ప్రశాంతత పొందడానికి ఈ సమయం అనువైనది.