ఈ పవిత్ర ప్రదేశం అల్మోర కు 6 కి.మీ.ల దూరంలో కలదు. ఈ టెంపుల్ లో కుమావొన్ ప్రాంత దేముడు గోలు దేవత అంటే శివుడి అవతారం పూజించా బడుతోంది. ఈ టెంపుల్ ను 12 వ శతాబ్దం లో చాంద్ వంశ పాలకులు నిర్మించారు. కొండపై కల ఈ టెంపుల్ చుట్టూ దట్టమైన అడవులు కలవు. తమ కోరికలు తీరిన భక్తులు ఈ టెంపుల్ లో మేకలు బలి ఇస్తారు. కోరికలు తీరని వారు వారి కోరికలను గోడలపై అంటిస్తారు. అల్మోర నుండి టాక్సీలు బస్సులు ఇక్కడకు కలవు.