అలూవా లోని శివాలయంలో మహాశివరాత్రి పండుగ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ వేడెకలకు ఇక్కడకు తరలి వస్తారు. అలువాకు ప్రధాన నగరాలనుండి చక్కటి రవాణా కలదు. కొచ్చి పట్టణానికి 12 కి.మీ.ల దరూరంలో కలదు. ఇక్కడ మహాశివరాత్రి ఆరు రోజుల ఉత్సవాలుగా జరుపుతారు. మహాశివరాత్రి అంటే అది శివ భగవానుడి రాత్రి అని అర్ధం. దేవతలు, రాక్షసులు సముద్రాన్నిఅమృతం కొరకు మధించినపుడు ఒక కుండెడు విషం సముద్రం నుండి లభించింది. మానవజాతిని సంరక్షించేందుకు ఆ విషాన్ని శివ భగవానుడు త్రాగాడు. శివుడి కరుణా కటాక్షాలకు గాను భక్తులు, మహాశివరాత్రి పండుగ మొదటిరోజు రాత్రి వేళ జాగారం చేస్తారు.
పండుగ రెండవ రోజున, అలూవా ప్రజలు వారి పూర్వీకులకు వావుబలి కార్యక్రమం ద్వారా తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. పట్టణంలో ఒక గొప్ప జాతర చేస్తారు. పట్టణం అంతా దీనిలో పాల్గొని ఆనందిస్తారు.
ఇక మూడు, మరియు నాల్గవ రోజులలో దిగ్విజయం అనే పేరుతో పండుగ చేస్తారు. అయిదవరోజున పల్లివెట్ట నిర్వహిస్తారు. ఆరవ రోజున హారతి లేదా తపోత్సవం పేరుతో వేడుకలను ముగిస్తారు. ఇక్కడి దేవాలయం పండుగలకే కాదు దాని శిల్ప సంపదలకు కూడా ప్రసిద్ధి చెందింది. దీని శిల్ప శైలి దేవాలయాన్ని ఎణపుడు చూసినా నిర్మాణంలో ఉన్నట్లే చూపుతుంది. దేవాలయానికి మరింత అందాలను చేకూర్చుతూ పెరియార్ నది దేవాలయం పక్కనుండి ప్రవహిస్తుంది.