Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అలూవా » వాతావరణం

అలూవా వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం అలూవా ప్రాంతం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరమే. వర్షాకాలం, శీతాకాలాలలో పర్యటన అనుకూలమైనప్పటికి వేసవిలో కూడా ఈ ప్రాంత సందర్శన సూచించదగినదే. అలూవా సందర్శనకు సెప్టెంబర్ నుండి నవంబర్ చివరి వరకు ఆహ్లాదకరమే. ఈ సమయంలో వర్షాల కారణంగా మీ సైట్ సీయింగ్ లకు ఆటంకాలు ఏర్పడవు.

వేసవి

వేసవి వేసవి మార్చి నుండి మొదలై మే నెల వరకు ఉంటుంది. అలూవాలో ఈ వేసవిలో ఒకమోస్తరు వేడి మరియు తేమ వుంటాయి. వేసవి అధిక వేడి కాకపోవటం వలన అలూవాకు ఈ కాలంలో కూడా సందర్శించవచ్చు.

వర్షాకాలం

వర్షాకాలం కేరళలోని అన్ని ప్రదేశాలవలెనే అలూవాలో కూడా అధిక వర్షాలు కురుస్తాయి. జూన్ నుండి ఆగస్టు వరకు వర్షాకాలం. అయినప్పటికి ఈ సమయంలో కేరళ పర్యటన ఆహ్లాదకరమే.

చలికాలం

శీతాకాలం అలూవాలో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య భాగం వరకు ఉంటుంది. శీతాకాలం ఒక మోస్తరు చలితో పర్యటన మధురానుభవంగానే ఉంటుంది.