కలాకండ్ మార్కెట్ షాపింగ్ ప్రియులకు ఆనందాన్నిచ్చే ప్రదేశం, ప్రత్యేకంగా ఇది నోరూరించే తీపి వంటలకు ప్రసిద్ది. ఈ మార్కెట్ లో అనేక వీధులను అక్కడ దొరికే ప్రముఖ వంటకాలను బట్టి పిలుస్తారు. పర్యాటకులు ఆకర్షణీయమైన హస్త కళలు, ఆభరణాలు దగ్గరలోని దుకాణాలలో సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ మార్కెట్ లోని షాపింగ్ విభాగాలను సర్రఫా బజార్, బజాజా బజార్, హో ప్ సర్కస్, కేదల్ గుంజ్, మలఖేర్ బజార్ అంటారు.