Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అల్వార్ » వాతావరణం

అల్వార్ వాతావరణం

ప్రయాణానికి ఉత్తమ సమయం : వాతావరణ౦ చల్లగా, ఆహ్లాదంగా ఉండే అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఉన్న సమయ౦ అల్వార్ పర్యటనకు ఉత్తమమైనది. పచ్చదనంతో నిండి వాతావరణం మధ్యస్థంగా ఉండే వర్షాకాలంలో కూడా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించ వచ్చు.

వేసవి

వాతావరణం అల్వార్ లో వాతావరణం ఏడాది లో ఎక్కువ భాగం పొడిగా ఉంటుంది.వేసవి కాలం (ఏప్రిల్ నుండి జూన్) : వేసవి కాలం ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలం లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 41, 28 డిగ్రీలు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం(జూలై నుండి సెప్టెంబర్ ) : అల్వార్ లో వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. నగరంలో ఈ కాలంలో అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఈ కాలం లోవాతావరణం తేమగా, చల్లగా ఉంటుంది. వర్షాల తర్వాత అల్వార్ అందంగా కనబడుతుంది.

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) : శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 23, 5 డిగ్రీలుగా నమోదౌతాయి. వాతావరణ౦ చల్లగా ఆహ్లాదంగా ఉండే శీతకాలాలు అల్వార్ లో అన్ని పర్యాటక కార్యక్రమాలకు సరైనవి.