Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అమర్ నాథ్

అమర్ నాథ్ - ప్రధాన యాత్రా స్థలం!

18

శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన “శివ లింగం”,ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు.

హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు.

హిమాలయాలకు వెళ్ళే దారిలో, పరమశివుడు తన తలపై ఉన్న చంద్రున్నిచందన్వారి వద్ద, తన వృషభం నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని ప్రతీతి. పిదప, శివుడు, తన తనయుడు, గజ దేవుడైన గణేశునిమహగుణాస్ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్ నాగ్ వద్ద విడిచి పెట్టాడు. తర్వాత, మహా శివుడు, పంచ భూతాలని పంచ్ రత్ని వద్ద వదిలి గుహ లోకి వెళ్ళాడని నమ్మిక.

అప్పడు శివుడు, తన మాటలను ఎవరూ వినకుండా ఉండేందుకు గానూ, గుహ లో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు. అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న రెండు పావురం గుడ్లకి మాత్రం ఎటు వంటి హాని జరగలేదు. ఆ రెండు గుడ్లు, శివుడు రహస్యాన్ని వివరిస్తూ ఉండగా,నిశ్శబ్దంగా పొదిగి,మాటలను దొంగ చాటుగా వినేసాయి.

అమర్ నాథ్ గుహ చేరుకోగానే, యాత్రికులు పావురాల జంటను చూడవచ్చు. వ్యాప్తి లో ఉన్న నమ్మకం ప్రకారం, శివుని రహస్యం చాటుగా విన్న ఆ రెండు పావురాలు, మరల మరల జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే అవి అమర్ నాథ్ గుహను తమ నిత్య నివాసం గా చేసుకున్నాయి.

6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన, నీలమాత పురాణం లో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు. ఈ పురాణం కాశ్మీరీల కర్మకాండ ను మరియు వారి సాంస్కృతిక జీవన శైలులను వివరిస్తుంది. క్రీ. పూ 34 లో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజ తో కూడా అమర్ నాథ్ ముడిపడి ఉంది. కాలక్రమంలో ఈ రాజు, తన రాచరిక హక్కును విసర్జించాడు. వేసవుల్లో అతను ఇక్కడికి చేరుకొని సహజ రీతిన మంచుతో తయారయినశివ లింగాన్ని పూజించాడని నమ్ముతారు. రాజతరంగిణి లో కూడా అమర్ నాథ్ అమరేశ్వర గా పేర్కొనబడింది. 1420 మరియు 1470 ల మధ్య జరిగిన తన అమర్ నాథ్ యాత్రా కాలం లో సుల్తాన్ జైన్లబిదిన్, షా కోల్ అనే కాలువ నిర్మించాడు.

అమర్ నాథ్ యాత్రలో, ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహను తప్పక చూడాలి. ఈ గుహ లో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు “శివ లింగం” ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివ లింగం పెరగటం తరగటం జరుగుతుంది. మే నుంచి ఆగష్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది.ఈ గుహ 5000 ఏళ్ల నాటిదిగా చెప్పబడుతుంది.ఇది శివుడు పార్వతి దేవి కి అమరత్వ రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతుంది.

గణేశునికి,పార్వతి దేవి కి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి. భారతీయ సైన్యం, భారతీయ పారామిలటరీ దళాలు, సి.ఆర్.పి.ఎఫ్, ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి. అందువల్ల, అమర్ నాథ్గుహ ను సందర్శించాలంటే ఉన్నత అధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి.

శేష్ నాగ్ సరస్సు అమర్ నాథ్ లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది పహల్గాం కి 27 కి.మీ ల దూరంలో ఉంది. ఈ సరస్సు, సముద్ర మట్టానికి 3658 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల, జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో అమర్ నాథ్ యాత్రికులు , పర్యాటకులు ఈ సరస్సు కి భారీ సంఖ్యలో వస్తారు.

అమర్ నాథ్ సందర్శించేవారు, విమానం లో గానీ రైలు లో గానీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి అత్యంత దగ్గరలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. ఇది ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తో చక్కగా అనుసంధానించబడింది. అమర్ నాథ్ ని రైలు లో చేరగోరే వారు జమ్మూ రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. ఇక్కడికి దేశం లోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి రైళ్లు ఉన్నాయి.

వేసవి లో సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. అయితే, శీతాకాలం విపరీతమైన చలిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత -5 డిగ్రీల దాకా పడిపోతుంది. అమర్ నాథ్ సాధారణంగా నవంబర్ నుంచి మార్చి/ఏప్రిల్ దాకా మంచు తో కప్పబడి ఉంటుంది. ఏడాది లో ఏ సమయంలోనైనా వర్షాలు పడవచ్చు. వర్షాలు అమర్ నాథ్ యాత్రకు అడ్డంకి గా మారతాయి. అమర్ నాథ్ దర్శించడానికి మే నుంచి అక్టోబర్ మధ్యనెలలు సరైన సమయం.

అమర్ నాథ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అమర్ నాథ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అమర్ నాథ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అమర్ నాథ్

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: యాత్రికులు అమర్ నాథ్, పవిత్ర గుహలను కాలిబాటన చేరుకోవచ్చు.జమ్మూ, శ్రీనగర్ లు సమీప ప్రధాన గమ్యాలతో బాగా అనుసంధానించబడి ఉన్నాయి. శ్రీనగర్ నుంచి చండీగఢ్, జమ్మూ, ఫల్గన్, ఢిల్లీ, మరియు లేహ్ వంటి ప్రదేశాలకు బస్సులు ఉన్నాయి. ఇక్కడికి టాక్సీలు కూడా ఉంటాయి. జమ్మూ నుంచి అమర్ నాథ్ ప్రవేశ స్థలం అయిన పహల్గాం 363 కి.మీ ల దూరం. పహల్గాం నుంచి అమర్ నాథ్ గుహలు సుమారు 50 కి.మీ ల దూరం లో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: అమర్ నాథ్ ఆలయం కేవలం కొన్ని నెలలు మాత్రమే తెరచి ఉన్నప్పటికీ, జమ్మూ రైల్వే స్టేషన్, భారత దేశం నలు మూలల నుంచి అమర్ నాథ్ కు వచ్చే యాత్రికులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది బెంగుళూర్, చెన్నై, ఢిల్లీ, మరియు ట్రివేండ్రం వంటి అన్ని ప్రముఖ భారతీయ నగరాలు మరియు పట్టణాల తో చక్కగా అనుసంధానించబడింది. పర్యాటకులు జమ్మూ రైల్వే స్టేషన్ నుండి అమర్ నాథ్ చేరుకోవడానికి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన యానం: షేక్-ఉల్-ఆలం విమానాశ్రయం గా పిలవబడే శ్రీనగర్ విమానాశ్రయం అమర్ నాథ్ కి అతి సమీపం లోని విమానాశ్రయం. శ్రీనగర్ ఢిల్లీ, జమ్మూ లకు విమానాలచే అనుసంధానించబడి ఉంది. ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీనగర్ కి అతి దగ్గరలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం. ఢిల్లీవిమానాశ్రయం, దేశం లోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri