అంబోలి లోని హిరణ్య కేశి దేవాలయం యాత్రికులను అధిక సంఖ్యలో సంవత్సరమంతా ఆకర్షిస్తూనే ఉంటుంది. పార్వతీ దేవిని ఇక్కడ హిరణ్యకేశి అని పిలుస్తారు. దేవాలయానికి కూడా అదే పేరు వచ్చింది. ఈ దేవాలయంలోనే శివ భగవానుడు కూడా దర్శనమిస్తాడు. ఈ దేవాలయం హిరణ్య కేశి నది ఒడ్డునే కలదు. చక్కటి ప్రశాంతమైన ధ్యానం చేసుకోవడానికి లేదా ఫిషింగ్ పట్ల ఆసక్తి కలవారికి చేపలు పట్టటానికి ఈ ప్రదేశం ఎంతో అనువైనది. సమీప ప్రదేశాల అందచందాలు మిమ్ములను మైమరపింపచేస్తాయి.