అంబీ వేలీ లోని లీ బొంబార్డా ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ గడిపే వారికి వారి వారి నీటి క్రీడలలో ఎంతో ఉత్సాహం, శక్తినిస్తుంది. ఒక జెట్ స్కై అద్దెకు తీసుకోండి లీ బొంబార్డాకు ప్రయాణించండి. ఈ ప్రదేశం 18వ శతాబ్దపు పైరేట్ ఓడకు నమూనాగా ఉంటుంది. మీరు నీటిని ఇష్టపడేవారైతే, ఈ బోటింగ్ తప్పక ఆనందిస్తారు. మీ వద్ద డబ్బు అధికంగా అనిపిస్తే లీబొంబార్డా పై విలాసవంతమైన ఒక డిన్నర్ కూడా ఏర్పరచవచ్చు.