Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అండమాన్ మరియు నికోబార్

అండమాన్ మరియు నికోబార్ - నిర్మలమైన నీటి ద్వీపాలు

మనిషి సాధారణంగా ఎంతో కాలం నుండి నీటితో కూడిన బీచ్ విహారాలంటే దూరంగానే ఉంటున్నాడు. ఆ బీచ్ బ్రెజిలియా అమెజాన్ లేదా ఇబిజా దేశంది అయినప్పటికి గుంపులు లేని ఒంటరి విహారాలు పర్యాటకుడికి ఎపుడూ ఎంతో ప్రశాంతతను అందిస్తాయి. మరి అటువంటి గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాలు మీకు కావాలంటే, అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు వెళ్ళి తీరాల్సిందే మరియు ఆనందించాల్సిందే.

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల భౌగోళికత పరిశీలిస్తే......

ఈ సెలవుల విహార ప్రదేశం సుమారు 8000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగి అనేక ప్రకృతి దృశ్యాలతో మీ రాకకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది.

ఈ ప్రదేశం భారతదేశానికి దక్షిణ దిశగా చివరి భాగంలో ఉండటమే కాదు, బంగాళా ఖాత సముద్రంలో మనకు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటూ అతి పెద్ద కోస్తా తీరం కలిగి ఉంది.

అండమాన్ మరియు నికోబార్ అనే ఈ రెండు ద్వీపాలు పది డిగ్రీల ఉత్తర అక్షాంశంచే వేరు చేయబడుతూ రెండు విడి విడి ద్వీపాలుగా ఉన్నాయి. మరి ఈ ద్వీపాలను చేరాలంటే, పోర్ట్ బ్లెయిర్ లోని ప్రత్యేక విమానాశ్రయం ద్వారా వెళ్ళవలసిందే. ద్వీపాలన్నిటిలోను పోర్ట్ బ్లెయిర్ అధిక జనసాంద్రత కలిగి ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్ నుండి మీరు ఏ రకమైన రవాణా అయినా సరే చేపట్టవచ్చు. ఉత్తరం నుండి దక్షిణ దిశగా ఈ ద్వీపాలు నీటిలో ఎత్తైన పర్వత శ్రేణులతో సుమారు 800 కిలో మీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. పోర్ట్ బ్లెయిర్ కు వెళ్ళాలంటే, తూర్పు కోస్తాలో కల భారతీయ ఓడరేవులైన చెన్నై లేదా మద్రాస్ మరియు కోల్ కటా లేదా కలకత్తాలనుండి కూడా ఫెర్రీలో చేరుకోవచ్చు.

అండమాన్ మరియు నికోబార్ దీవులు సందర్శనలో మీరు ప్రధానంగా చూడవలసిన ఆకర్షణలు

అండమాన్ మరియు నికోబార్ దీవులు ఒక అంతు లేని పరిశుభ్రమైన ఇసుక కల బీచ్ ల సముదాయాలుగా ఉంటాయి. మీరు స్కూబా డైవింగ్ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే. మీకు మరో లబ్దిగా ఈ దీవులు ఇటీవలే, పర్యావరణ స్నేహప్రదేశాలుగా గుర్తించబడి ప్రకటించబడ్డాయి.

మీకు లభించే ఆకర్షణలు అంతూ పొంతూ లేని బీచ్ లు చూడటంతో ముగిసిపోవు. లేదా స్కూబాతో సరిపోవు. ఈ దీవులలో అతి విశాలమైన దట్టమైన అరణ్యాలు కూడా ఉన్నాయి. వీటిలో వందలాది విభిన్న జాతుల పక్షులు, పూలు వంటివి ప్రత్యేకించి జంటలకు హనీమూన్ ఆనందాలు మరింత పెంచుతాయి. పర్యాటకుల కొరకు స్ధానికులు చేసే ఏర్పాట్లు పర్యావరణ స్నేహపూరితంగా ఉండి, నగరాలనుండి దూరంగా మీరు పొందగల కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు మొదలైనవి అందిస్తాయి. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఎంత ప్రత్యేకం అని పర్యాటకులకు తెలుపాలంటే, ఇప్పటికి ఇక్కడి అడవులలో సుమారు 2200 మొక్క జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో సుమారు 1300 జాతులవరకు మన భారత ప్రధాన భూభాగం కలిగి ఉంది.

అండమాన్ మరియు నికోబార్ దీవులు అలంకరణకు ప్రసిద్ధి గాంచిన షెల్ ఫిష్ లేదా ఓస్టర్లకు అతి పెద్ద మార్కెట్.ఇక భవిష్యత్తులో వేసవి సెలవులకు ఈ ద్వీపాలు ప్రధాన విశ్రాంతి నిలయాలుగా భారత దేశంలో పేరు తెచ్చుకోనున్నాయి. హేవ్ లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్ ను పేరొందిన టైమ్ మేగజైన్ వారు ఇటీవల ఆసియాలోనే అతి గొప్పదైన బీచ్ గా వర్ణించారు. హేవ్ లాక్ బీచ్ తన సుందరమైన నీలను నీటి ప్రవాహాలతో అనేక జలచరాలతో ఎంతో ఆకర్షణీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

అండమాన్ లో విశ్రాంతి సెలవులు అంటే చాలు పర్యాటకులు జాలీబాయ్ చూసేందుకు ఇష్టపడతారు. జాలీబాయ్ ద్వీపం పక్కనే కల హేవ్ లాక్ దీవి మరియు సింకే దీవి లతో కూడా కలిపి మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ గా చెపుతారు. ఈ పార్క్ నే వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కాలుష్యం ఏ మాత్రం లేకుండా నియంత్రణ చేయటం వలన, స్వచ్ఛమైన మరియు నిర్మలమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకుల స్వర్గంగా చెప్పవచ్చు. ఇక్కడి జలచరాల జీవనం, స్వచ్ఛమైన అనేక పగడపు దిబ్బలు, మొక్క మరియు జంతు శ్రేణులు వంటివి ఈ ప్రాంతంలో మరెక్కడా లభించవు.

మరి ఇంత అందమైన, అనేక విశిష్టతలు కల ఈ ద్వీపాలను చేరుకోవటం ఎలా?

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలను చేరుకోవటం చాలా తేలిక. భారతదేశంలోని అనేక ఎయిర్ లైన్ సంస్ధలు పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అయిన వీర సావర్కార్ విమానాశ్రయానికి కోల్ కటా, భుమనేశ్వర్ మరియు చెన్నై లనుండి తమ విమానాలను నడుపుతున్నాయి. ఖ్యాతిగాంచిన ఓడ రవాణా సంస్ధ షిప్పింగ్ కార్బోరేషన్ ఆఫ్ ఇండియా ఎం.వి. నాన్కోవరీ అనే ఓడను చెన్నై మరియు పోర్ట్ బ్లెయిర్ ల మధ్య నెలకు రెండు సార్లు మరియు విశాఖ పట్లణం నుండి పోర్ట్ బ్లెయిర్ కు మూడు నెలలకు ఒక సారి నడుపుతోంది.

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం ఎలా?

అండమాన్ మరియు నికోబార్ దీవుల వాతావరణం, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలైన ధాయ్ లాండ్ మరియు సింగపూర్ ల వలెనే పెద్ద మార్పులు లేకుండా సంవత్సరమంతా ఒకే విధమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ దీవులను సందర్శించాలంటే అక్టోబర్ నుండి మే వరకు అనుకూలం. ఈ సమయంలో ఇక్కడ వార్షిక పర్యాటక ఉత్సవాలు జరుగుతాయి. అంతే కాక ఈ సమయంలో చక్కటి వర్షాలు పడి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. బీచ్ లో ఒక రోజు గడపాలంటే ఏ మాత్రం వేడిగా ఉండదు.

ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు సాధారణంగా 24 డిగ్రీలనుండి 32 డిగ్రీ సెల్షియస్ వరకు మారుతూంటాయి. చలికాలంలో ఒకటి లేదా రెండు డిగ్రీలు తగ్గుతాయి. వాతావరణం ఏదైనప్పటికి అండమాన్ నికోబార్ దీవులలో తేమ అధికంగా ఉంటుంది.

అండమాన్ మరియు నికోబార్ ప్రదేశములు

  • పోర్ట్ బ్లెయిర్ 28
  • గ్రేట్ నికోబార్ 7
  • హేవ్ లాక్ ఐలాండ్ 12
  • పోర్ట్ బ్లెయిర్ 28
  • గ్రేట్ నికోబార్ 7
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu