Search
  • Follow NativePlanet
Share

అస్సాం పర్యాటకరంగం – అడవిలోకి పయనం!

విభిన్న సంస్కృతి, పచ్చని అడవులతో నిండిఉన్న అస్సాం ప్రతి సందర్భంలోనూ ప్రకృతికి దగ్గరగా ఉన్న ఒక రాష్ట్రము. వన్యప్రాణి పర్యటనను ఇష్టపడే వారికి అస్సాం చాలా అందిస్తుంది. ఈ ఈశాన్య రాష్ట్రము ఉత్తరాన భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ తో, తూర్పున నాగాలాండ్, మణిపూర్ తో, దక్షిణాన మిజోరం తో సరిహద్దులను పంచుకుంటుంది.

అస్సాం లోని వన్యప్రాణుల పర్యాటకరంగం అస్సాం వన్యప్రణుల పర్యాటకరంగానికి పేరుగాంచింది. నేషనల్ పార్కు లు, ఇతర అభయరణ్యాలు అస్సాం పర్యాటక రంగంలో ప్రధానమైనవి. ఈ నేషనల్ పార్కు అనేక అరుదైన జంతు జాతులను కలిగిఉంది, సాహస పర్యాటక అవకాశాన్ని కూడా అందిస్తుంది. అస్సాం పర్యాటక రంగం అందించే ప్రసిద్ధ ఆకర్షణలలో కాజీరంగా వన్యప్రాణుల అభయారణ్యం ఒకటి. ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ స్థలంగా ప్రసిద్ది చెందింది, ఇది గోల్డెన్ లంగూర్, బెంగాల్ ఫ్లోరికన్, పిగ్మీ హాగ్, తెల్ల రెక్కల వుడ్ డక్ మొదలైన వాటితో పాటు భారతీయ ఖడ్గమృగాన్ని కలిగిఉండి, ప్రపంచంలోని అనేక అరుదైన వన్యప్రాణుల జాతులకు నిలయంగా ఉంది. ఈ జాతీయ పార్కు ప్రపంచంలోని అత్యధిక పులులను కూడా కలిగిఉంది. ఇక్కడ స్కావెంజర్లు, వలస పక్షులు, వేటాడే నీటి పక్షులు, ఆట పక్షులతోపాటు అనేక రకాల పక్షులను కూడా చూడవచ్చు.

కాజిరంగా వన్యప్రాణుల అభయారణ్యమే కాకుండా, మానస్ నేషనల్ పార్క్ కూడా దాని జీవ వైవిధ్యంలో యునెస్కో లో స్థలం సంపాదించుకుంది. మానస్ దేశంలోని మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్, అదేవిధంగా ఇది అనేక రకాల ఇతర వన్యప్రాణుల జాతులను కూడా కలిగిఉంది. ఇది దాని అద్భుతమైన అందానికి, సంరక్షణకు కూడా పేరుగాంచింది. పోబితోర వన్యప్రాణుల అభయారణ్యం, ఓరంగ్ నేషనల్ పార్కు, నమేరి నేషనల్ పార్కు మొదలైనవి కొన్ని అస్సాం లోని ఇతర నేషనల్ పార్కులు. అస్సాం పర్యాటక రంగం కలిగిఉన్న ఇతర అంశాల అన్వేషణ అస్సాం గొప్ప వన్యమృగాలను అందించడమే కాకుండా, అనేక కట్టడాలకు, దేవాలయాలకు పేరుగాంచింది.

దేశంలోని వివిధ ప్రాంతాలనుండి అనేకమంది జాతుల, సంస్కృతుల వారు వలస వచ్చారు కాబట్టి, ఇది పలు సంస్కృతుల పరిపూర్ణ సమ్మేళనం. రాష్ట్రంలోని ముఖ్య మతపరమైన కేంద్రాలలో కామాఖ్య ఆలయం, ఉమానంద ఆలయం, నవగ్రహ ఆలయం, ఇతర ధార్మిక ప్రదేశాల మధ్య సత్రాలు ఉన్నాయి. మీలో సాహసవంతులు ఉంటే....మీలో సాహసాన్ని ఇష్టపడే వారు ఉంటే, వారికి ఎప్పటికీ విసుగు పుట్టని ప్రదేశం ఇది.

అస్సాం పర్యాటక రంగం అనేక రకాల రివర్ క్ర్యూజ్, రివర్ రాఫ్టింగ్, గాలం వేయడం, పర్వతారోహణ, ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్, పారా నౌకాయానం, హాంగ్ గ్లైడింగ్ వంటి సాహస కృత్యాలను అందిస్తుంది. ఇక్కడ గొల్ఫింగ్ తెలుసుకోవడానికి, ప్రయత్నించడానికి అనేక గోల్ఫ్ క్లబ్బులు ఉన్నాయి. అస్సాం సంస్కృతి, పండుగలు అస్సాం వేడుకల, ఉత్సవాల రాష్ట్రము. వారి ఉత్సవాలు, వారి సంపన్న సంస్కృతి, నమ్మకాలు వారి సాంప్రదాయ జీవనశైలిని సూచిస్తాయి. బిహు, రోన్గ్కర్, బైశాగు, జొన్బిల్ మేళ, బిఖో మొదలైనవి ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన పండుగలు.

అస్సాం లోని సౌకర్యాలు, అనుసంధానాలు అస్సాం వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. లోకప్రియ గోపీనాథ్ బోర్దోలోయి అంతర్జాతీయ విమానాశ్రయం గౌహతి లో ఉంది. ఈ విమానాశ్రయం దేశంలోని అనేక మహా నగరాలకు అనుసంధానించబడి ఉంది. ఈ రాష్ట్రము సౌకర్యవంతమైన రైల్వే నెట్వర్క్ ను, అదేవిధంగా రోడ్డు మార్గం ద్వారా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉంది.  

అస్సాం ప్రదేశములు

  • అస్సాంలో నేషనల్ పార్క్స్ 23
  • గువహతి 49
  • డిబ్రూ ఘర్ 19
  • జోర్హాట్ 35
  • కాజిరంగా 24
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu