బాగా లోని టిటో వీధిలో మాంబోస్ చివరి ప్రదేశం. ఆ వీధి అంతా నైట్ క్లబ్బులు, బార్లు, పూల్ పార్లర్లు ఉన్నప్పటికి , చిట్ట చివరి భాగంలో ఉన్న కేఫే మాంబోస్ తప్పక చూడాలి. ఈ క్లబ్ గోవాలో చాలా పురాతనం మరియు ప్రసిద్ధి గాంచిన నైట్ క్లబ్. వీనుల విందైన సంగీతాన్ని మీకు అందిస్తుంది. మాంబోస్ లో ప్రవేశ రుసుము జంటలకు సుమారు రూ. 500 గా మరియు సింగిల్స్ కు రూ. 500 గా ఉంటుంది. అయితే, ఈ ప్రవేశ రుసుములో మీకు ఆహారం లేదా డ్రింకులు ఇవ్వరు. మీరు వాటికి ప్రత్యేక చెల్లింపు చేయాల్సి ఉంటుంది. మరో విచిత్ర అంశంగా మాంబోస్ లో క్రెడిట్ కార్డుల వంటివి అంగీకరించరు. కనుక తగినంత నగదు జేబులో పెట్టుకొని మీరు అక్కడ పార్టీలు చేసుకోవాలి.
గోవాలో కల ఇతర క్లబ్ ల వలే కాకుండా మాంబోస్ మీకు డిన్నర్ మెనూ లో అలా కార్టే సర్వీస్ అందిస్తుంది. ఆహారం కూడా ఆల్కహాల్, కాక్ టెయిల్స్ వెనే ఎంతో రుచికరంగా ఉంటాయి. అక్కడి డిన్నర్ ఆహారంలో గో బాగా ప్రసిద్ధి గాంచిన పోర్క్ వంటకం తప్పక తిని చూడండి. ఇక్కడ డ్యాన్స్ ఫ్లోర్ మరియు రెస్టరెంట్లు విడి విడి ప్రదేశాలలో ఉంటాయి. కనుక రెంటిని వేరు వేరుగా ఆనందించవచ్చు. ఇక భధ్రత విషయానికి వస్తే, అన్ని ప్రదేశాలలోను భధ్రత చాలా ఖచ్చితంగా ఉంటుంది. చవకబారు మత్తుమందులు కొట్టటం వంటివి పూర్తిగా నిషిద్ధం. అక్కడ ఏదైనా దుండగీ పనులు చేస్తే, భధ్రతా విభాగం తక్షణం నియంత్రించేసి ఇతరులకు ఆటంకం కలుగకుండా చేస్తుంది. బార్ టేబుల్స్ సుమారుగా మూడు ప్రదేశాలలో ఉంచారు. ఫాస్ట్ ఫుడ్ ఆహారాలు, మాంబోస్ లో బయటా, లోపలా కూడా సెర్వింగ్ చేస్తారు. డేన్స్ ఫ్లోర్ చాలావరకు అధిక సంఖ్య జనాలు కలిగి పూర్తిగా నిండి ఉంటుంది. మాంబోస్ చేరటం తేలిక. బాగా కు క్యాబ్ సర్వీస్ మాట్లాడుకోండి టిటోస్ వీధిలోకి రండి. రాత్రులందు ఈ వీధిలో ట్రాఫిక్ అధికమే. ఎవరైనా క్యాబ్ కదలికకు అభ్యంతరం పెడితే మీరు ఆ వీధిలో నడచి క్లబ్ చేరవలసి ఉంటుంది. ఈ క్లబ్ చేరే లోపు మీరు అనేక ఇతర క్లబ్ లను కూడా బయట నుండి చూడవచ్చు.