Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బలంగీర్

బలంగీర్  –  పరిమళించే దివ్య సౌరభం  !!

16

బలంగీర్ సాంస్కృతిక, వారసత్వ సంపద ఉన్న ఒక ముఖ్యమైన వాణిజ్య నగరం. ఈ ప్రాంతం అనేక పురాతన ఆలయాలు, విగ్రహాలు, ప్రాచీన కాలం నుండి నివసించే స్వదేశీ తెగలతో కూడిన దాని అందమైన ప్రాంతాలకు ప్రసిద్ధి. ఈ స్థలం ఒకప్పుడు రాచరిక రాష్ట్ర౦ పట్నాఘర్ కు రాజధానిగా ఉన్న గత వైభవాన్ని, ఆకర్షణను ఇప్పటికి కల్గి ఉంది. 19 వ శతాబ్దానికి చెందిన బలంగీర్ రాజు బలరాం దేవ్ నిర్మించిన బలరాంఘర్ అనే కోట పేరును ఈ ప్రాంతానికి పెట్టారు.

బలంగీర్ లోనూ, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

బలంగీర్ లో పర్యాటక రంగం అనేది ఈ నగరం చుట్టూ ఉన్న చూడచక్కని ప్రాంతాల వల్లనే. జలియా, చుట్టూ దట్టమైన అడవులు ఉన్న ఒక అందమైన గ్రామం. ఈ ప్రాంతం పర్వతారోహణకు ప్రసిద్ధి.

ఈ అందమైన గ్రామం గుండా ప్రవహించే నది వలన ఈ గ్రామం విహారయాత్రలకు ప్రియమైన ప్రాంతమైంది. బలంగీర్ నుండి జలియా 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. బలంగీర్ అందించే మరొక పర్యాటక ఆకర్షణ గైఖయి. ఇది మూడు వైపులా కొండలు ఉన్న ఒక పచ్చటి సుందర దృశ్యాల లోయ. ఈ ప్రాంతం విడిదికి, విహారయాత్రలకు అనువైనది.

బలంగీర్ పర్యటన పట్నాఘర్ రాణిపూర్, ఝరియాల్, సైంతల టెంటులిఖుంటి ముర్సింగ్, జల్ మహదేవ్ సందర్శించనిదే పూర్తి కాదు. సుఖ్తేల్ నది పై నిర్మించతలపెట్టిన దిగువ సుఖ్తేల్ ప్రాజెక్ట్ విహారయాత్రలకు అందమైన ప్రదేశం.

బలంగీర్ పర్యాటక రంగం వైవిధ్య భరిత ప్రాంతాలను పర్యాటక ఆకర్షణలుగా అందిస్తుంది. మీరు ఆశ్రమాలు, సరస్సులు, భవనాలు, పార్కులు, వివిధ మతాలకు చెందిన ఆలయాలు, విగ్రహాలు అన్ని ఈ నగరంలో చూస్తారు. బలంగీర్ రాజకుటుంబం ఒకప్పుడు నివసించిన సైలశ్రీ భవనాన్ని ఒరిస్సాలోని ఉత్తమ భవనాలలో ఒకటిగా పరిగణిస్తారు. మీరు ఆధ్యాత్మిక అనుభవం కోసం ఎదురు చూస్తుంటే, నగరం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఖుజెంపలి లో ఉన్న ఆనంద నికేతన్ ను సందర్శించండి. వందేళ్ళ కిందటి పురాతన రాజేంద్ర పార్కు రకరకాల గులాబీ పూలతో అలంకరించబడి ఉంటుంది.

ఒరిస్సా లోని పురాతన సరస్సులలో ఒకటి కరంగ కట కూడా ఒక అందమైన విహార యాత్ర ప్రాంతమే. బలంగీర్ పురపాలక సంఘం వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి బోటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రవేశ పెట్టారు. ఈ ప్రాంతం చుట్టూ అందమైన తోటలు ఉన్నాయి. ఈ సరస్సు దగ్గరలో బలంగీర్ లోని దుర్గామందిరం ఉంది.

ధార్మిక ప్రాంతాలు

పటనేశ్వరిమాత ఆలయంలోని పటనేశ్వరి గుడి మాతను ఈ ప్రాంతంలోని దేవతగా పరిగణిస్తారు. గోపాలజి ఆలయం, లక్ష్మి నారాయణ ఆలయం, కృష్ణ భగవానునికి, లక్ష్మీదేవికి చెందినవి.

హైశంకర్ ఆలయం, సమలేశ్వరి మాత ఆలయం, నరసింఘ ఆలయం, సంతోషి ఆలయం, లోకనాథ బాబా ఆలయం, శీతల మాత ఆలయం, భగవత్ ఆలయం, జగన్నాథ ఆలయం, మౌసి మాత ఆలయం, రాంజీ ఆలయం, శ్యామ కాళీ ఆలయం, సాయిబాబా ఆలయం చెప్పుకోదగిన వానిలో కొన్ని.

జోగేశ్వర శివాలయానికి ప్రసిద్ధి చెందిన జోగిస్నద్ర, బలంగీర్ నగరం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏటా వందలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

తిక్రపరలో ఒక సున్ని మసీదు ఉంది. రుగుడి పడలో రోమన్ క్యాథలిక్ చర్చి, ఆదర్శపడలో ప్రొటెస్టెంట్ చర్చి ఉన్నాయి. హిందూ-గుజరాతి మతస్థులు జలారం ఆలయానికి, సింధీ మతస్థులు ఝులేలాల్ ఆలయానికి పూజించడానికి వెళ్తారు.

షాపింగ్, ఆహారం

ప్రాంతాలను సందర్శించడంతో బాటుగా బలంగీర్ లో మీరు చేయవలసిన పనులు చాల ఉన్నాయి. ఈ నగరం సంబల్పూర్ చీరలు, డ్రస్ మెటీరియల్, దుప్పట్లకు ప్రసిద్ధి.

తీపి అంటే ఇష్టమైన వారికోసం, నోరూరించే లబన్ గలాట, చెన గాజ, అరిస పిత, చెన పెడ బలంగీర్ లో దొరుకుతాయి. నోరూరించే చకులి పిత, పితవు భజ, గుల్గుల, చవుల్ బరని కూడ వద్దనడం చాల కష్టం.

బలంగీర్ పర్యటనకు ఉత్తమ సమయం

బలంగీర్ ను అక్టోబర్, ఫిబ్రవరి మధ్య ఉండే శీతాకాలంలో సందర్శించవచ్చు.

బలంగీర్ చేరడం ఎలా

బలంగీర్ రైలు స్టేషన్ నుండి ఈ ప్రాంతాన్ని చేరవచ్చు. ఒరిస్సాలోని ఇతర ప్రాంతాల నుండి ఈ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం బస్సులను నడుపుతుంది. ఇక్కడ విమానాశ్రయం లేదు. అతి దగ్గరది భువనేశ్వర్ లో ఉంది.

బలంగీర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బలంగీర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బలంగీర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బలంగీర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా బలంగీర్ కు చక్కటి రైలుమార్గం ఉంది. బలంగీర్ చేరడానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఇతర నగరాలు, పట్టణాల నుండి ఉన్నాయి. ప్రయాణానికి ఎయిర్ కండీషన్ బస్సులు, టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా బలంగీర్ రైలు జంక్షన్, ఝార్సుగుడ-సంబల్పూర్-తిత్లాఘర్ మార్గంలోని అతి ముఖ్యమైన ఆగ్నేయ రైలు కేంద్రం. ఈ నగరం నుండి ఒరిస్సా లోని ఇతర ప్రాంతాలకు చక్కటి రైలు మార్గ౦ ఉంది. ఈ రైలుస్టేషన్ నుండి ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్ అతి దగ్గరి విమానాశ్రయం. రాష్ట్రంలోని అతి దగ్గరి విమానాశ్రయం భువనేశ్వర్ లో ఉంది. బలంగీర్ నుండి భువనేశ్వర్ 321 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat