విన్నూత్నమైన రీతిలో తయారైన ఈ ఉద్యానవనం ప్రజల్ని ఆకర్షిస్తుంది. జలాశయం, పర్యావరణానికి అనుకూలంగా వుండే బోటింగ్ పార్కు కలిగిన బెంగళూరు లోని అవుటర్ రింగ్ రోడ్డు లో వున్న హెబ్బాల్ కేమ్పపుర లో వుంది. నాగవార చెరువు గట్టు వెంట 1.5 కిలోమీటర్ల పొడవునా వుంటుంది ఈ తోట.
బుద్ధుని జన్మ స్థలం పేరిట ఏర్పాటయిన ఈ పార్క్ లో 25 అడుగుల బుద్ధ విగ్రహం కూడా వుంది. కుటుంబ వినోదానికి అనువైన ప్రదేశం ఇది. ఇక్కడ అమ్యూస్మేంట్ పార్క్ లలో లాగా పిల్లల కోసం పుష్కలంగా వినోద సాధనాలు ఉండడంతో కుటుంబాలు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతాయి.చెరువులో బోటింగ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ కాగా, పిల్లలో కోసం బౌన్సీ ట్రైన్, మైదానం, బంగీ జంప్, బౌన్సీ రైడ్స్, స్పానిష్ బుల్ రైడింగ్ లాంటి వినోదాలు ఉన్నాయి. బెంగళూరు లో లేని ఏకైక పర్యాటక ప్రదేశం బీచ్ – అయితే ఇక్కడ కృత్రిమంగా తయారైన అలల కొలను ఆ లోటును కూడా తీరుస్తుంది.
మీ కుటుంబం తో కలిసి ఉద్యానవనం లో తిరుగుతుంటే పచ్చదనం తో కలిసిన కొలను దృశ్యం మిమ్మల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సరసమైన ధరలకు ఆహరం అందించే రక రకాల ఫుడ్ కోర్ట్ లు కూడా ఇక్కడ వున్నాయి. సాహసం నుంచి విరామ సమయం దాకా ఎన్నో రకాల అవకాశాలు అందించే ఈ ప్రదేశం కుటుంబ వినోదం కోసం వెళ్ళాల్సిన ఏకైక స్థలం.