ఊలార్ సరస్సు తూర్పు ఒడ్డున గల బండీపూర్ ని ఊలార్ పోర్టు అని కూడా పిలుస్తారు. ఊలార్ సరస్సు ఆసియా ఖండం లోనే అతి పెద్ద మంచి నీటి సరస్సు. జమ్ము కాశ్మీరులో కల ప్రసిద్ధ మొఘల్ ఉద్యాన వనం "నిషత్ బాగ్" ని పోలి నిర్మించిన పార్కు అనేక మంది సందర్శకులకి బండీపూరు లో కనువిందు చేస్తూ ఉంటుంది.
బండీ పూర్ పట్టణం లోనే అటవీ శాఖ ట్రెయినింగ్ మరియు పరిశొధనా సంస్థ కూడా ఉంది. జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లో కెల్ల అతి పెద్ద ముస్లిం మత విద్యా సంస్థ అయిన "దారుల్-ఉల్లోం-రెహమియ" ఈ పట్టణం లోనే ఉంది.
బండీపూర్ పట్టణం ఫిషింగ్ కే కాకుండా పర్వత అధిరోహణా క్రీడలైన "ట్రెక్కింగ్" మరియు "మౌంటెనీరింగ్" కి ప్రసిద్ధి. ఔత్సాహికులైన పర్వతాధిరోహకులు బండీపూరుకి తూర్పున గల హర్ముక్ పర్వతాన్ని సందర్సించాలి. హర్ముక్ పర్వతాన్ని చేరుకునేటప్పుడు సందర్శకులు "షీరా సర్" లేదా "లేక్ ఆఫ్ స్పిరిట్స్" గా పిలవబడే ప్రాంతం లో విడిది చేయవచ్చు.
దగ్గరలో గల ఆరిన్ నల్లా ప్రాంతం పరదెశ మత్స్య జాతులైన "గ్రే ట్రౌట్","సిల్వర్ ట్రౌట్","రెయింబో ట్రౌట్" లకి ప్రసిద్ధి.