దేవ్ కా సూర్య దేవాలయం బార్మర్ కు 235 కి.మీ. ల దూరంలో కల దేవ్ కా అనే చిన్న గ్రామంలో కలదు. 13వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం విశిష్టమైన శిల్ప సంపద కలిగి పర్యాటక ప్రదేశంగా ఉంది. ఇక్కడే విష్ణు దేవాలయం మరియు మరో రెండు చిన్న దేవాలయాలు కూడా పర్యాటకులు చూడవచ్చు. వాటిలో ఒకటి గణేశ దేవాలయం.