Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెకాల్ » వాతావరణం

బెకాల్ వాతావరణం

ఉత్తమ సీజన్ బెకాల్ లో సంవత్సరం పొడవునా ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ బెకాల్ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు అనుకూలం. ఈ సమయంలో వాతావరణం చల్లగాను మరియు పొడి గాను ఉంటుంది. ఈ సమయం లో పర్యటన అనుకూలం. అయితే, వేడిగా ఉన్నప్పటికీ చాలామంది పర్యాటకులు ఏప్రిల్ మరియు మే నెలలలో కూడా వస్తారు. మీరు వర్షాలు ఇష్ట పడే వారైతే జూన్ నుండి సెప్టెంబర్ వరకు కూడా ప్రణాళిక చేయవచ్చు.

వేసవి

వేసవి ఈ ప్రదేశం లో వేసవి మార్చ్ లో మొదలై మే నెల చివరి వరకూ వుంటుంది. గరిష్ట ఉష్నోగ్రతలు 36 డిగ్రీలు వరకు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ ఉంటుంది. జూన్ లో నైరుతి రుతుపవనాలు మొదలవుతాయి. అధిక వర్షాలు కురుస్తాయి. గాలి లో తేమ సుమారుగా 90 శాతం పైగా ఉంటుది. అక్టోబర్ నెలలో ఈశాన్య రుతుపవనాలు వస్తాయి.  

చలికాలం

శీతాకాలం ఒక మోస్తరు చలి కలిగి వుంది పొడి గా వుంటుంది. ఈ కాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెంటి గ్రేడ్ వరకూ కూడా పడిపోతాయి.