ఇంద్రహార్ పాస్ కు పడమటి దిక్కున మింక్యాని పాస్ వుంది. ఇక్కడికి కూడా ధర్మశాల నుంచి చంబా కు వెళ్ళే పర్వతారోహణ మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడినుంచి యాత్రికులు ఉత్తరాన వున్న పర్వతాల అందాలను చూడవచ్చు. ఈ పాస్ ను కరేరి సరస్సు నుంచి కూడా పర్వతారోహణ ద్వారా చేరుకోవచ్చు. కానీ అలా వెళ్తే ఇక్కడికి చేరుకోవడానికి రెండు రోజులు పడుతుంది.