Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భోపాల్ » వాతావరణం

భోపాల్ వాతావరణం

సెప్టెంబర్, నవంబర్ నెలలో మధ్యలో భోపాల్ సందర్శనకు సరైనది. సంవత్సరంలో అక్టోబర్ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అనేకమంది పర్యాటకులు నగర సందర్శనకు పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే, ఈ సమయంలో ఇక్కడ రాత్రులు, సాయంత్రాలు చలిగా ఉంటుంది కాబట్టి సున్నితమైన శీతల దుస్తులతో ప్రయాణం చేయడం ఉత్తమం.

వేసవి

వేసవి భోపాల్ లో మార్చ్ నుండి మే వరకు వేడిగా, కొంచెం తేమ వాతావరణాన్ని కలిగిఉంటుంది. ఈ సమయంలో ఇక్కడి ఉష్ణోగ్రత 45 డిగ్రీలతో అధికంగా ఉండి, మధ్యాహ్నాలు ఇంటినుండి బైటికి రావడానికి కూడా సాధ్యపడదు. నగర సందర్శనకు ఇది ఉత్తమ సమయం కాదు, మీరు ప్రయాణ సమయంలో ఎండ దెబ్బకు, డిహైడ్రేషన్ కి గురౌతారు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. అలాగే అక్టోబర్ ప్రారంభ సమయంలో చెదురుమదురు జల్లులను చూడవచ్చు. ఈ ప్రదేశం అధిక వర్షపాతాన్ని కలిగిఉంటుంది, నగరంలోని అనేక ప్రాంతాలు నీళ్ళతో రోడ్లు ని౦డిఉండడం వల్ల ఎక్కువగా రవాణాకు అంతరాయం కలుగుతుంది. వర్షాకాల సమయంలో భోపాల్ సందర్సన సరైనది కాదు.

చలికాలం

శీతాకాలం భోపాల్ లో శీతాకాలం అక్టోబర్ చివర మొదలై వాతావరణం ఆహ్లాదకరంగా ఉండే నవంబర్ మధ్య వరకు ఉంటుంది, సీతాకాలలు చాలా ఎక్కువగా, పొగమంచుతో కూడుకొని ఉండి సాధారణ జీవితానికి ఆటంకం కలిగిస్తాయి. ఈ చల్లని వాతావరణం మార్చ్ మధ్య వరకు ఉంటుంది.