ఆది బ్రహ్మ ఆలయం, ఇది హిందూ దేవుడు, సృష్టికర్త, బ్రహ్మ యొక్క ఆలయం. ఈ ఆలయం భున్తార్ నుండి సుమారు 4 కి.మీ. దూరాన ఉన్న ఖోఖాన్ గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం సున్నితమైన కొయ్యతో తయారుచేయబడింది మరియు ఈ ఆలయం మధ్యలో మొహ్రాలు మరియు జ్ఞాపకార్ధ కవచాలు పోదిగిఉన్న ఒక రథంతో పాటు బ్రహ్మదేవుని విగ్రహం ఉన్నది. ఈ మొహ్రాలను ఇత్తడి, వెండి, మరియు అష్టధాతు;ఎనిమిది లోహాల సమ్మేళనంతో తయారుచేశారు. ఈ ఆలయంలో హిందూ దేవుడు, విష్ణువు యొక్క విగ్రహం కూడా ఉన్నది. నాలుగు కప్పులు కలిగి, ఆలయం పగోడ నిర్మాణశైలిలో ఉన్నది.
దేవాలయ ప్రవేశం ద్వారం మీద పురాణ కథలకు సంబంధించిన వ్యాఖ్యానం చెక్కబడి ఉన్నది. ఈ ఆలయానికి ఇరువైపులా గర్ జోగ్ని మరియు మణికరన్ జోగ్ని ఆలయాలు ఉన్నాయి. ఇదివరలో, ఈ ఆలయ సమీపంలో ఒక సహజసిద్ధ నీటిపాయ ప్రవహిస్తుండేది,కాని అది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. పండుగలు, నాగిని బిర్షు,ఖోఖాన్ పండుగ,మొహల్ పండుగ మరియు భులాంగ్ బిర్షు కొన్నిటిని ఇక్కడ జరుపుకుంటారు.