కొలయాట్ దేవాలయం, బికనేర్ కు 15 కిలోమీటర్ల దూరంలో కొలయాట్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. కొలయాట్, వేదకాలపు ఋషి కపిలుడు తన శరీరాన్నిఒక మర్రి చెట్టు కింద త్యజించిన స్థలంగా విశ్వసిస్తారు. ఇక్కడి పాలరాయి దేవాలయాలు ఇసుకరాయిలో నిర్మించిన అందమైన మంటపాలతో అలంకరిచబడ్డాయి.
దేవాలయాలతో బాటుగా ఈ ప్రాంతంలో ఒక పెద్ద కృత్రిమ సరస్సు చుట్టూ నిర్మించిన 32 రేవులు ఉన్నాయి. భక్తులు ఈ ప్రాంతపు నీటిలో మునక పవిత్రమైనదని భావిస్తారు. ఇక్కడ ప్రతి ఏటా కార్తిక మాసంలో పౌర్ణమినాడు ఒక పెద్ద ఉత్సవ౦ జరుగుతుంది. పశువుల సంత ఈ ఉత్సవానికి వచ్చే ప్రజలకు పెద్ద ఆకర్షణ. కొలయాట్ పట్టణ౦, రోడ్డు, రైలు ద్వారా బికనేర్ కు కలపబడింది.