స్టేషన్ రోడ్డు, నగరంలోని మరో షాపింగ్ విభాగం. ప్రత్యెక రాజస్థానీ ఉత్పత్తులను, మంచి ధరలలో, సహనంతో కూడిన బెరసారాలతో కొనుగోలు చేస్తారు. ఈ షాపులలో విస్తృత శ్రేణిలో జూతిస్ అనే చేతిపని పాదరక్షలు, స్థానిక దుస్తులు, తోలు వస్తువులు, సాంప్రదాయ కళాఖండాలు, చెక్క సామాగ్రి అందిస్తున్నారు. పర్యాటకులు తాము కోరుకున్న రీతిలో చేతిపని పాద రక్షలను 24 గంటలలో పొందవచ్చు.
సున్నితమైన సాంప్రదాయ చిత్రాలూ, బంగారపు చెక్క పని, తోలుతో చేసిన హస్తకళలు, ఈ మార్కెట్ ప్రధాన ఆకర్షణలు, ఈ ప్రాంతంలో ప్రముఖ బ్రాండ్ ‘హల్దిరామ్స్’ అసలు దుకాణం ఉండటం వల్ల భోజన ప్రియులలో ప్రసిద్ది చెందింది. ప్రజలు షాపింగ్ కాకుండా, అనేక నోరూరించే భుజియాలు, స్వీట్ల కూడా ఈ ప్రాంతంలో రుచి చూస్తారు.