Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బిష్ణుపూర్

బిష్ణుపూర్ - డ్యాన్సింగ్ డీర్, తేలియాడే పొదలు మొదలైనవి

15

బిష్ణుపూర్ ను మణిపూర్ సాంస్కృతిక మరియు మతపరమైన రాజధానిగా పిలుస్తారు. ఈ ప్రదేశంలో విష్ణువు నివసించటం, అందమైన గోపురం ఆకారంలో టెర్రకోట దేవాలయాలు మరియు ప్రఖ్యాత డ్యాన్సింగ్ డీర్, సాంగై వీటి అన్నిటితో ఉన్న బిష్ణుపూర్ స్వర్గము వలె ఉంటుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ ఉన్నది. బిష్ణుపూర్ ను గతంలో లుమ్లన్గ్దొంగ్ అని పిలిచేవారు. బిష్ణుపూర్ కు ఉత్తరాన సేనాపతి మరియు వెస్ట్ ఇంఫాల్ జిల్లాలు, పశ్చిమాన చురచంద్పూర్ జిల్లా, తూర్పున ఆగ్నేయమున తౌబాల్ జిల్లా, తూర్పున ఛాండల్ సరిహద్దులుగా కలిగి ఉంది. బిష్ణుపూర్ జిల్లాలో బిష్ణుపూర్ పట్టణం జిల్లా ప్రధానకేంద్రంగా ఉంది. తన్గ్జరోక్ నది బిష్ణుపూర్ పట్టణం గుండా ప్రవహిస్తుంది. బిష్ణుపూర్ ను బిషేన్పూర్ అని కూడా అంటారు.

వన్యప్రాణి మరియు మచ్ మోర్ - బిష్ణుపూర్ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

బిష్ణుపూర్ డ్యాన్సింగ్ డీర్-సాంగై లకు నిలయంగా ఉంది. ఇక్కడ ప్రపంచంలోనే అరుదైన జింక జాతిని చూడవచ్చు. సాంగై లోక్టాక్ సరస్సు యొక్క దక్షిణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. లోక్టాక్ లేక్ తూర్పు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. బిష్ణుపూర్ జిల్లాలో కెఇబుఇ లామ్జో నేషనల్ పార్క్ ఉంది.

కెఇబుఇ లామ్జో నేషనల్ పార్క్ లో అడవిపంది, లేడి, నీటి పక్షులు వంటి ఇతర జంతువులు మరియు సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యంలకు నిలయంగా ఉంది. ఈ జాతీయ పార్క్ జిల్లాలోని చాలా ముఖ్యమైన మరియు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. కెఇబుఇ లామ్జో నేషనల్ పార్క్ లోక్టాక్ లేక్ సరిహద్దులో ఉండి పర్యాటకులకు అద్భుతమైన వీక్షణను ఇస్తోంది.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి అంకితం చేయబడిన INA మెమోరియల్ కాంప్లెక్స్, ఇళ్ళు, గతకాలపు స్వాతంత్ర్య సమరయోధుడు యొక్క పునరావశేషాలను కలిగి ఉన్న ఒక మ్యూజియం ఉన్నాయి.

సరస్సు లో తేలియాడే చిత్తడినేలలు ఉంటాయి. స్థానికంగా ఆ ప్రాంతం చుట్టూ వృక్ష సంపద నీటిలో మునిగి ఉండుట కారణంగా ఫుమ్ది సరస్సు రంగు ఆకుపచ్చ రంగులో కనపడుతుంది. లోక్టాక్ లేక్ చుట్టూ గ్రామాలు ఈ తేలియాడే వృక్షసంపద పక్కన ఉండుట వల్ల అక్కడి ప్రజలు జీవితం గడపడం కష్టతరంగా ఉంటుంది.

ప్రజలు మరియు బిష్ణుపూర్ సంస్కృతి

బిష్ణుపూర్ లో నివసిస్తున్న ఎక్కువ మంది ప్రజలు మెఇతిఎస్. వారు మణిపూర్ యొక్క చాలా ముఖ్యమైన నియమాలను పాటిస్తారు. వారు హిందూయిజం మరియు వైష్ణవులను అనుసరిస్తారని చెప్పవచ్చు. మేటి పంగాల్స్ (మణిపురి ముస్లింలు), నాగ, కబుఇ , గంగ్తే , కొమ్ వంటి బిష్ణుపూర్ లో నివసిస్తున్న అనేక ఇతర తెగలు మరియు వర్గాలుగా ఉన్నాయి. బిష్ణుపూర్ లో వ్యవసాయం ప్రజల ప్రధాన జీవనాధారంగా ఉంది. వారు కూడా అత్యంత ప్రజాదరణ పొందిన అనేక పండుగలను జరుపుకొంటారు. లై హరోబ పండుగ సంవత్సరం పొడవునా జరుపుకుంటారు.

లై హరోబ పండుగ ఒక పురాతన హిందూ మత దేవత అయిన లార్డ్ తన్గ్జింగ్ అంకితం చేయబడింది. ఇది మే నెలలో జరుపుకుంటారు. అనేక మంది సంబరాలలో పాల్గొనేందుకు చాలా ప్రదేశాల నుండి వస్తారు .ఎదుధొఉ తన్గ్జింగ్ ఆలయంలో తన్గ్జింగ్ అనే ఒక సంప్రదాయ దేవతకు అంకితం చేయబడింది . ఈ ఆలయంను తప్పక సందర్సించాలి.

ఏప్రిల్ నెలలో చెఇరఒబ పండుగను మణిపూర్ అంతటా జరుపుకుంటారు. ఈ సమయంలో అన్ని ఇళ్ళు బాగా కాంతివంతమైనవిగా ఉంటాయని చెప్పవచ్చు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందంను సూచిస్తుంది. యాదృచ్ఛికంగా చెఇరొబ పండుగ కూడా మేటి న్యూ ఇయర్ పండుగతో సమానంగా ప్రాధాన్యత పెరుగుతోంది.

హిందువులు భారతదేశం యొక్క ఇతర ప్రాంతాల్లో జరుపుకొనే హోలీ మాదిరిగానే మణిపూర్లో యోశాంగ్ పండుగను జరుపుకుంటారు.ఈ శక్తివంతమైన పండుగ ఫిబ్రవరి / మార్చి నెలలో ఐదు రోజుల పాటు కొనసాగుతోంది. బిష్ణుపూర్,మణిపూర్లో చాలా ఆనందంతో యోశాంగ్ ఉత్సవంను జరుపుకుంటారు.

బిష్ణుపూర్ యొక్క చరిత్ర

బిష్ణుపూర్ మణిపూర్ ఆలయం పట్టణంగా మారటానికి ఒక ఆసక్తికరమైన కధ చరిత్రలో ఉన్నది . 1467 AD ప్రాంతంలో పాలించిన రాజు క్యామకు పొంగ్ రాజు మద్య మంచి సంబంధాలు ఉండేవి. పొంగ్ సహాయంతో కింగ్ క్యామ విజయవంతంగా క్యంగ్ అనే షాన్ సామ్రాజ్యంపై దాడి చేసేను. యుద్దంలో ఇద్దరు రాజులు గెలుపొందెను. ఆ విజయానికి గుర్తుగా కింగ్ పాంగ్ కింగ్ క్యామకు విష్ణువు యొక్క ఒక విగ్రహంను బహుకరించటం జరిగినది. ఈ విగ్రహంను లుమ్లన్గ్ద్ లో ఉంచబడిన తరువాత ఆ పట్టణంను బిష్ణుపూర్ అని పిలిచేవారు. విష్ణువు ఉన్న ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ సమయంలోనే విష్ణువును ఆరాదించే రాష్ట్రంగా ప్రసిద్ధిచెందింది.

బిష్ణుపూర్ సందర్శించడానికి ఉత్తమ సమయంబిష్ణుపూర్ సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఉంది.

బిష్ణుపూర్ చేరుకోవటం ఎలా

బిష్ణుపూర్ ను విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

వాతావరణము బిష్ణుపూర్ లో వాతావరణం ఆధునికంగా ఉంటుంది . ఆధునిక వేసవి మరియు శీతాకాలాలు ఉంటాయి.

 

బిష్ణుపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బిష్ణుపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బిష్ణుపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బిష్ణుపూర్

  • రోడ్డు ప్రయాణం
    రైలు మార్గం నిజానికి మణిపూర్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం కలిగి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రైల్వే నారో గేజ్ చేరుకొనేందుకు జిరిబం మాత్రమే ఉంది. పర్యాటకులు రైలు ద్వారా బిష్ణుపూర్ చేరుకోవాలని అనుకుంటే వారు మొదటి 236 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిమాపూర్ చేరుకోవలసి ఉంటుంది. డిమాపూర్ నుండి టాక్సీలు ద్వారా బిష్ణుపూర్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రోడ్డు మార్గం జాతీయ రహదారి 150 బిష్ణుపూర్ తో రాష్ట్ర రాజధానిని కలుపుతుంది. అంతేకాకుండా జిల్లాకు లైఫ్ లైన్ గా పనిచేస్తుంది. NH 150 చేరే ఇంఫాల్ NH 39 (గౌహతి చేరే) మరియు NH 53 (సిల్చార్ నుండి) ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడిన. NH 150 జిల్లాలో అన్ని ప్రధాన పట్టణాలు దాటుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం బిష్ణుపూర్ సమీపంలోని విమానాశ్రయం 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ విమానాశ్రయం. అన్ని ప్రధాన విమానయాన సంస్థలు ఢిల్లీ, గౌహతి మరియు కోలకతా నుండి ఇంఫాల్ కు అనుసంధానం కలిగి ఉన్నాయి. ఇంఫాల్ విమానాశ్రయం నుండి బిష్ణుపూర్ చేరటం పెద్ద కష్టం కాదు. రోడ్లు ద్వారా రాష్ట్రంలో ఇతర భాగాలకు అనుసంధానించబడింది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun