Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బోమ్డిలా

బోమ్డిలా   – ఒక అందమైన ఆనందం !!

20

అరుణాచల్ ప్రదేశ్ లో సందర్శించవలసిన అనేక ప్రదేశాలలో ఒకటైన బోమ్డిలా సముద్ర మట్టానికి దాదాపు 8000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణం. అందమైన పరిసరాల నడుమ అల్లుకొని ఉండి, ప్రసిద్ధ తూర్పు హిమాలయ శ్రేణులను కలిగిఉండి, బోమ్డిలా వద్ద సందర్శకులు ఆస్వాదించడం కోసం ఉన్న నిష్కల్మషమైన పట్టణం. దాని సహజ అందం, యాపిల్ తోటలతోపాటు, బోమ్డిలా బౌద్ధుల ఆశ్రమాలకు కూడా పేరుగాంచింది. అలాగే ఈ పట్టణంలో, అనేక పర్వతారోహణ శిక్షణలు ఉండడం వల్ల సాహస ప్రియుల దృష్టిని ఆకర్షించింది.

బోమ్డిలా – ఒక సంక్షిప చరిత్ర

బోమ్డిలా మధ్యయుగ కాలంలో టిబెట్ రాజ్యానికి చెందినదని చరిత్ర చెపుతుంది. అంతేకాకుంటా, స్థానిక గిరిజన పాలకులు, భూటాన్ పాలకులు కూడా తిరిగి సమయంలో, ఈ పట్టణాన్ని పాలించడంలో పాల్గొన్నారు. 1873 బ్రిటీషు వారి పరిపాలనలో, ఈ ప్రాంతానికి కొన్ని పరిమితులను పేర్కొనడం జరిగింది. బోమ్డిలా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని 1962 లో చైనావారు ఆక్రమించారు, కానీ తరువాత బలగాలు తిరిగి వెళ్ళిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈ భాగం ఎప్పుడూ 1947 నుండి భారతదేశం, చైనా మధ్య వివాదాస్పద అంశంగా మారింది.

బోమ్డిలా లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

ఒక పర్యాటక ప్రదేశం లాగా, బోమ్డిలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉండడం వల్ల, ఈ అందమైన పట్టణం, ప్రకృతి సంపూర్ణ అందానికి సాక్షలను చూడాలనే పర్యాటకులు సందర్శించవలసిన ఉత్తమ ప్రదేశం. బోమ్డిలా నుండి, పర్యాటకులు మంచు రాళ్ళతో నిండిన శిఖరాలతో పాటు, క్లిష్టమైన హిమాలయ శ్రేణులను కూడా చూడవచ్చు. అదనంగా, ఈ పట్టణంలో ప్రయాణీకుల విశ్లేషణకు బౌద్ధ ఆరామాలు, గోమ్పాలు ఉన్నాయి. సందర్శకులు బోమ్డిలా వద్ద స్థానిక టిబెటన్ ల మోమోలు, తూపాల వంటి రుచికరమైన ఆహారపదార్ధాలను కూడా ఆస్వాదించవచ్చు.

అందమైన బోమ్డిలా పట్టణాన్ని చూసాక ఇక్కడ కొన్ని స్మారకాలు కూడా కొనుక్కోవచ్చు. బోమ్డిలా సంప్రదాయ చేతిపనులకు ప్రసిద్ది, వీటిని ప్రధాన హస్త కళా కేంద్రం లోను, ఇతర దుకాణాల వద్దా కొనుగోలు చేయవచ్చు. ఉన్ని తివాచీలు, సంప్రదాయ తొడుగుల లాంటి చాలా రకాలు కొనుగోలు చేయవచ్చు. ఈ హస్త కళా కేంద్రం, దిగువ గోమ్పా, మధ్య గోమ్పా, ఎగువ గోమ్పా గా పిలువబడే మూడు బౌద్ధ ఆరామాలు బోమ్డిలా లో చూడదగ్గ ప్రదేశాలు.

బోమ్డిలా కు ఉత్తరం వైపు తవాంగ్ అనే అధ్బుతమైన చిన్న పట్టణం వుంది, బోమ్డిలా వెళ్ళిన పర్యాటకులు ఇక్కడికి వెళ్లి పర్వత శ్రేణుల అందమైన దృశ్యాలను చూడవచ్చు. సముద్ర మట్టానికి 3400 మీటర్ల ఎత్తున వున్న తవాంగ్ లో 17 వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ ఆరామం వుంది, ఇది 400 ఏళ్ళ నాటిదని చెప్తారు. పైగా, బోమ్డిలా లో సేస్సా పూల వనం, ఈగల్ నెస్ట్ వన్యప్రాణి అభయారణ్యం, కామెంగ్ ఏనుగుల అభయారణ్యం కూడా వున్నాయి – ఇక్కడ యాత్రికులు ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

బోమ్డిలా వాతావరణం

బోమ్డిలా లో తక్కువ వేసవి, ఎక్కువ చలికాలాలతో కూడిన పర్వతీయ వాతావరణం వుంటుంది.

బోమ్డిలా ఎలా చేరుకోవాలి ?

బోమ్డిలా తేజ్ పూర్ నుంచి రోడ్డు మార్గాన 180 కిలోమీటర్లు, తవాంగ్ నుంచి 160 కిలోమీటర్ల దూరం వుంటుంది. మీరు కార్ లో ప్రయాణి౦చక పొతే బోమ్డిలా వెళ్ళడానికి బస్సులు కూడా అందుబాటులో వున్నాయి.

బోమ్డిలా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బోమ్డిలా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బోమ్డిలా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బోమ్డిలా

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu