Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బోర్డి » వాతావరణం

బోర్డి వాతావరణం

సందర్శనకు మంచి సమయం ఎపుడు? బోర్డి లో వాతావరణం ఏ కాలమైనప్పటికి అంటే వేసవిలో అధిక వేడిగాను, చలికాలం అధిక చలిగాను ఉంటుంది. వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుండి మార్చి నెలవరకు చల్లగా ఉంటుంది. కనుక పర్యాటకులు ఈ సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆనందించవచ్చు.        

వేసవి

వేసవి వేసవి ఈ ప్రాంతంలో మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం ఎంతో వేడిగాను, తేమతో కూడినదిగాను ఉంటుంది. ఉష్ణోగ్రతలు తీవ్రమైన 45 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉంటాయి. గ్రామం అరేబియా సముద్రానికి దగ్గరగా ఉండటంతో  చల్లని సముద్ర గాలుల కారణంగా కొంతమేరకు వేడినుండి ఊరట కలుగుతుంది. మే నెల అత్యంత ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. ఈ సమయంలో బోర్డి సందర్శన అనుకూలం కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం బోర్డిలో వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. వర్షాలు ఒక మోస్తరుగా కురుస్తాయి. అప్పటివరకు గల వేసవి తాపాన్ని ఈ వర్షాలు తొలగిస్తాయి. ఈ సమయంలో వాతావరణం మరింత తేమగా ఉంటుంది.  ఈ సమయంలో సైట్ సీయింగ్ కొరకు చిన్నపాటి ట్రిప్పులు అంటే కొద్ది రోజులు వేయవచ్చు.

చలికాలం

శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం చల్లటి వాతావరణంగా కొనసాగుతుంది. పగటి పూట చల్లగాను రాత్రులందు మరింత చలిగా సుమారు 12 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది.