బుండి నుంచి 77 కిలోమీటర్ల దూరం లో వున్న ఇంద్రఘర్ కోట ను 17వ శతాబ్దంలో ఇంద్రసాల్ సింగ్ హడా నిర్మించాడు. ఒక పర్వతానికి దగ్గరలో వున్న ఈ కోట నాలుగు ద్వారాలు, బ్రహ్మాండమైన గోడలతో ఒక ప్రత్యెక నిర్మాణ శైలిని కలిగి వుంది. ఈ అందమైన కోట లోపల మూడు ప్రాసాదాలు వున్నాయి – జనానా మహల్, సుపారీ మహల్, హవా మహల్. అన్ని ప్రాసాదాలూ మెచ్చుకోదగ్గ కుడ్య చిత్రాలను కలిగి వున్నాయి. ఇంద్రఘర్ కోట కు బాగా దగ్గరలో కమలేశ్వర్ దేవాలయం, కాళీ దేవి ఆలయం వున్నాయి.