ఆరావళీ పర్వత సానువుల్లో వున్న జైత్ సాగర్ సరస్సు జైత్ మీనా నిర్మించిన అందమైన సరస్సు. దీని పైన పూర్తిగా వికసించిన కలువ పూల వల్ల ఈ చెరువు అందం మరింత హెచ్చింది. జైత్ సాగర్ చుట్టూ ఎత్తైన గోడలు వుండి, ఈ సరస్సుకు దారి తీసే నాలుగు ద్వారాలు వున్నాయి. ఇది బుండీ నుంచి 3 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో వుంది.