మొరె టౌన్ - మణిపూర్ కమర్షియల్స్ హబ్ !
మొరె, మణిపూర్ యొక్క వాణిజ్య పట్టణం మరియు మయన్మార్ వెళ్ళడానికి ప్రవేశ ద్వారంగా కూడా పనిచేస్తున్నది. మణిపూర్ దేశీయ తెగల వారు, సరిహద్దు మీదుగా ఉన్న తెగలవారితో సామరస్యంగా నివసిస్తున్న ఒక ఆసక్తికరమైన మిశ్రమ సంస్కృతిని మొరె పర్యాటకులకు అందిస్తున్నది.
మొరె, దేశంలోని సరళీకృత ఆర్థిక విధానాల వలన ప్రముఖంగా ఒక ముఖ్యమైన ఆర్ధిక పట్టణంగా లాభపడుతున్నది. మొరె, అనేక ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రవేశ ద్వారంగా కూడా పనిచేస్తున్నది మరియు ట్రాన్స్-ఆసియా సూపర్ హైవే ప్రాజెక్టు వెంటనే పూర్తి చేసినట్లయితే, మొరె భవిష్యత్తులో అపారమైన అభివృద్ధిని సాధిస్తుంది. పర్యాటకులు వీసా కలిగి ఉన్నట్లయితే, వారు సరిహద్దును క్రాస్ ఓవర్ చేయవచ్చుమరియు మయన్మార్ లో మొరె యొక్క సోదరి పట్టణం- 'టము' చేరుకోవొచ్చు. అనేక వాణిజ్య సంస్థలు మొరెలో వస్తున్నాయి మరియు దేశవ్యాప్త వ్యాపారం కూడా పెరిగింది.
ఇది రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరియు చందేల్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొరె చేరుకోవాలంటే, పర్యాటకులు మొదట చందేల్ చేరుకోవాలి.