చందేరి లో ప్రసిద్ది చెందిన దిగుడు బావి ఇది. సముద్రం లో నీళ్ళు ఉన్నంత కాలం ఈ బావి లో ని నీరు స్థిరం గా ఉంటుందని నమ్మకం. ఈ బావి యొక్క ఆశ్చర్యకరమైన లక్షణం ఏంటంటే ఈ బావి లో నీళ్ళు సంవత్సరం పొడుగునా ఒకే స్థాయిలో ఉంటాయి. ఈ దిగుడు బావి చతురస్రాకారం లో 60 అడుగుల ఎత్తు 60 అడుగుల వెడల్పు తో నాలుగు అంతస్తుల లోతు కలిగి ఉంది. ప్రధాన ప్రవేశం లో మొదలయ్యే మెట్లు బావి లోపల వరకు ఉన్నాయి. ప్రతి అంతస్తు వద్ద ముగిసే ప్రధాన మెట్లు ఈ బావికి చుట్టుపక్కల ఉన్న అందమైన ఘాట్స్ కి దారితీస్తాయి. ఈ బావి లో 32 మెట్లు ఉన్నాయి. బట్టిసి బావిడి షేర్ ఖాన్ చేత 1485 లో సుల్తాన్ ఘియసుద్దిన్ షా ఖిల్జీ పాలన లో నిర్మించబడింది.