చందేరి, బాలా కిలా మరియు ఖుని దర్వాజా వంటి ప్రసిద్ది చెందిన కట్టడాల మధ్య హత్ సాల్ నిర్మాణం జరిగింది. 15 వ శతాబ్దానికి ముందు ఇది నిర్మించబడింది. హత్ సాల్ చందేరి యొక్క ప్రసిద్ద్ మార్కెట్ ప్రాంతానికి ఒక గుర్తు. ఈ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న షాపులు పాదచారులకు అలాగే మావటి వాళ్ళకి సమానం గా తీర్చిదిద్దబడ్డాయి.
ఆరు అంతస్తుల ఎత్తుతో ఇక్కడ షాపులు ఉంటాయి. అందువల్ల ఎనుగులని నడిపే వాళ్ళు ఏనుగు మీద కుర్చునే తమకి కావాల్సిన వస్తువులని కొనుక్కునే అవకాశం ఉంది. ఈ కట్టడం స్థంబాలపై కట్టబడినది . హత్ సాల్ గా ప్రసిద్ది చెందింది. హత్ సాల్ అంటే ఏనుగుల స్థావరం అని అర్ధం. ఆ కాలం లో సాధారణమైన కలువ పువ్వు డిజైన్లు మరియు జైలు వర్క్ తో ఈ కట్టడం యొక్క నిర్మాణం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ కట్టడం యొక్క ప్రత్యేకత ఇప్పటికీ పర్యాటకులని అలరిస్తుంది.