Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఛౌకొరి » వాతావరణం

ఛౌకొరి వాతావరణం

ప్రయాణానికి అనువైన కాలం: వేసవికాలం మరియు శీతాకాల ప్రారంభకాలం, చౌకొరిని సందర్శించటానికి అనువుగా, సౌకర్యంగా ఉంటాయి.

వేసవి

వేసవికాలం (ఏప్రిల్ నుండి జూన్) : ఏప్రిల్ నెలలో ప్రారంభమై,జూన్ నెలలో అంతమవుతుంది. ఇక్కడి అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 17 డిగ్రీల సెంటిగ్రేడ్ ఈ కాలంలో నమోదు అవుతాయి. ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి ఇది అనువైన సమయం.

వర్షాకాలం

వానాకాలం (జూలై నుండి సెప్టెంబర్) : ఈ ప్రాంతంలో జూలై నుండి ప్రారంభమై, సెప్టెంబర్ చివరి వరకు భారీ వర్షాలు ఉంటాయి.

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) : చలికాలం అక్టోబర్ నెలలో ప్రారంభమై, ఫిబ్రవరి నెల చివరి వరకు ఉంటుంది. అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 10 డిగ్రీల సెంటిగ్రేడ్ మరియు 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఈ కాలంలో నమోదు అవుతాయి.