Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చెన్నై » వాతావరణం

చెన్నై వాతావరణం

ఉత్తమ కాలం : చెన్నైల్ సందర్శించాలంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో చెన్నై వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యరశ్మి తక్కువగా ఉండి, ప్రయాణానికి సైట్-సీఇంగ్ కు సౌకర్యంగా ఉంటుంది. ఈ సమయంలో రాత్రుళ్ళు కొద్ది చలిగా ఉంటుంది, కాని విపరీతమైన చలి ఉండదు.

వేసవి

వేసవికాలం : చెన్నైభూమధ్యరేఖకు దగ్గరగా ఉండటంవలన, ఇక్కడ చాలా వేడి మరియు ఆర్ద్రత గల వేసవులు ఉంటాయి. చెన్నైలో వేసవి ఏప్రిల్ నెలలో ప్రారంభమై మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ వరకు వెళుతుంది అందువలన ఇంట్లోనుండి బయటికి అడుగు పెట్టటమే కష్టంగా ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలం : ఇక్కడ వానాకాలం జూన్ నెల మధ్యలో ప్రారంభమవుతుంది. ఆగష్టు నెల చివరి వరకు భారీ వర్షాలు ఉంటాయి. ఈ సమయంలో దక్షిణ నైరుతి ఋతుపవనాల వలన చెన్నైలో భారీ వర్షాలు కురుస్తాయి. వానలవలన ఉష్ణోగ్రత తగ్గి, వేసవి వేడి అంటా కొట్టుకుపోతుంది. చెన్నై లోని ప్రజలు వాన పడుతున్నప్పుడు గొడుగు లేకుండా నడవటానికి ఇష్టపడతారు.

చలికాలం

శీతాకాలం : చెన్నై సముద్రానికి దగ్గరగా ఉండటంవలన ఇక్కడ చలి మద్యస్థంగా ఉంటుంది. ఇక్కడ చలికాలం ఎక్కువ రోజులు ఉండదు, ఇది నవంబర్ నెల మధ్యలో మొదలై ఫిబ్రవరి నెల మధ్య వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 19 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం వెచ్చగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు కొంతమంది సాయంత్రం సమయంలో మరియు రాత్రి సమయంలో వారితో తేలికపాటి జాకెట్ లేదా షాల్ తీసుకెళ్ళటానికి ఇష్టపడతారు.