Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చత్తీస్ గర్హ్

చత్తీస్ గర్హ్ - పురాతనత్వం,ప్రకృతి మరియు గిరిజనుల యోక్క మేలు కలయిక!

భారత దేశం లో 10 వ పెద్ద రాష్ట్రము గా మరియు జనాభా లో 16వ పెద్ద రాష్ట్రముగా చెప్పవచ్చు . 1వ నవంబర్ 2000 లో మధ్య ప్రదేశ్ నుండి విడిపోయి అవతరించిన ఛత్తిస్గర్హ్ విద్యుత్ శక్తి మరియు ఉక్కు ఉత్పత్తి గల రాష్ట్రము గా పేరు గడించింది. రాయ్పుర్ రాజధాని గా కల ఈ రాష్ట్రము మధ్య ప్రదేశ్ ,మహారాష్ట్ర,ఆంధ్రప్రదేశ్, ఒడిస , జార్ఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ లతో సరిహద్దుల్ని పంచుకుంటున్నది .'దక్షిణ్ కోసల' గా ఈ ప్రదేశం రామాయణ మరియు మహాభారతా ల లో ప్రస్తావించ బడినది . ఛతిశ్గర్హిన్ దేవి యొక్క 36 స్తంభాల టెంపుల్ పేరు మీద ఈ ప్రదేశానికి నికి ఈ పేరు వొచ్చింది .భౌగోళిక మరియు వాతావరణ విశేషాలు ఈ ప్రదేశం లో ని ఉత్తర దక్షినాల లో ఉన్న కొండల తో కూడిన ప్రాంతం సైనిక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలది . సగానికి పైగా రాష్ట్రము దట్టమైన అడవులతో నిండి ఉన్నది .

ఇండో గంగెటిక్ ప్లైన్ మరియు మహానంది నది వలన ఈ ప్రదేశం లో ని అనేక ప్రాంతాలలో సారవంతం గా వ్యవసాయానికి అనువు గా ఉంటుంది . ఉష్ణ మండల వాతావరణం ఈ ప్రదేశం లో చూడవచ్చు . ఎండా కాలం చాలా వేడిగా చలికాలం ఆహ్లాద కరం గా ఉంటుంది . వర్షా కాలం లో మోస్తారు వర్షాలు కురుస్తాయి . నవంబెర్ నుండి జనవరి వరక పర్యటనకు అనువు గా ఉంటుంది . రైలు మార్గం మరియు రోడ్డు ద్వారా ఈ ప్రదేశం చక్కగా అనుసంధానించబడినది . 11 జాతీయ రహదారులు ఈ ప్రదేశం కుండ వెళ్తాయి. ఇక్కడి ముఖ్య రైల్వే జంక్షన్ అయిన బిలాస్పూర్ మాత్రమే కాక దుర్గ్ మరియు రైపూర్ నుండి వెళ్ళే రైళ్ళు కూడా ఇతర నగరాలకు కలుపుతాయి .రైపూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ వాణిజ్య సేవలని అందిస్తుంది .

పర్యాటక విశేషాలు ఈ రాష్ట్రము లో నిఅనేక ప్రాంతాలలో జరిగిన తవ్వకాల ద్వారా ఛత్తిస్గర్హ్ యొక్క నాగరికత అతి ప్రాచీన మైనదని తెలుస్తున్నది . రాష్ట్రమంతా ప్రక్రుతి అందాలతో నిండి ఉంటుంది . అడువులు , వన్యమృగాలు , అందమైన జలపాతాల తో నిండి ఉంటుంది . చిత్రకోతే ఫాల్స్, తిరథ్గర్హ్ వాటర్ ఫాల్స్ , చిత్రధా ర వాటర్ ఫాల్స్ , తామర ఘోమర్ వాటర్ ఫాల్ , మండవ వాటర్ ఫాల్ , కంగేర్ ధారా , అకురి నాల , గవర్ ఘాట్ వాటర్ ఫాల్ మరియు రామ దహ వాటర్ ఫాల్ అందులో కొన్ని.. ఛత్తీస్ గర్హ్ పర్యటన లో వారసత్వ సంపద గా కల పురాతన స్మృతులు , దేవాలయాలు కూడా ఒక భాగం . అనేక మయిన ఇటువంటి పర్యాటక ప్రదేశాలతో పర్యాటకుల మనసుని రంజింప చేస్తుంది ఈ ప్రదేశం . మల్ల్హర్ , రాతన్పూర్ , సిర్పూర్ మరియు సర్గుజ వంటి పురాతత్వ విసేసః ప్రదేశాలు చుదతగ్గవి . ప్రకృతి ప్రేమికులకు అద్బుత ప్రదేశం గా బస్తర్ ను చెప్పవచ్చు .

వేడి నీటి కొలనులు మరియు గుహలు పర్యాటకులను ఆకర్షిస్తాయి . జగదల్పూర్ లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ మరియు కంగేర్ ఘటి నేషనల్ పార్క్ , రైగర్హ్ లోని గోమార్డ రిజర్వు ఫారెస్ట్ , బిలాస్ పుర్ లోని బర్నవపర వైల్డ్ లైఫ్ శాన్చుయరి , ఆచనక్మార్ వైల్డ్ లైఫ్ శాన్చురి , మరియు ధంతరి లోని సితనది వైల్డ్ లైఫ్ శాన్చురి రాష్ట్రము లో పేరుగాంచిన వైల్డ్ లైఫ్ శాన్చురి మరియు నేషనల్ పార్క్ లు . కోతుమ్సర్ కేవ్స్ , గడియ మౌంటెన్ , కైలాష్ కేవ్స్ వంటి మరి కొన్ని గుహలు ఆధ్యాత్మిక లేక పురా తన చిత్రాల వాల్ల పేరు గాంచినవి . కవార్ధ లోని భొరమ్దెఒ టెంపుల్ , రైపూర్ లోని చంపారణ్ , జంజ్గిర్ - చంప లోని దముధర , దంతేవాడ లోని దంతేశ్వరి టెంపుల్ , మహా మాయ టెంపుల్ వంటి ఇక్కడి ఆధ్యాత్మిక ప్రదేశాలు సంవత్సరం లో ఎల్లపుడు భక్తులతో కిట కిట లాడుతూ ఉంటాయి . జగదల్పూర్ లోని అన్త్రోపోలోజికల్ మ్యుసియం బస్తర్ గిరిజనుల జీవన విధానం మరియు సంస్కృతీ విశేషాలను తెలియ చేస్తుంది . జగదల్పూర్ లోని మరో ఆకర్షణ బస్తర్ పాలసు. పూర్వం బస్తర్ రాజ్యం యొక్క హెడ్ క్వార్టర్ ఐన ఈ పాలసు ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనం లో ఉన్నది . ఇవన్ని కలిపి ఈ ప్రదేశ పర్యటనను ఆకర్షనీయం గా మారుస్తున్నాయి.

ఛత్తిస్గర్హ్ - ప్రజలు సంస్కృతీ మరియు పండుగలుచత్తిస్గర్హ్ టూరిజం ఇక్కడి స్థానిక ప్రజల జానపద ,గ్రామీణ జీవితాల పై ద్రుష్టి సారిస్తుంది . గోండ్ , హల్బి , హల్బ , కమార్ మరియు ఒరాన్ వంటి గిరిజనులు ఇక్కడ నివసిస్తారు . హిందీ నగరవాసుల వాడుక బాష కాగా చ్చాట్టిస్గార్హి - హిందీ మాండలిక బాష గ్రామీణ ప్రజల వాడుక బాష కోసలి , ఒరియా మరియు తెలుగు కూడా కొంతమంది గిరిజనులు మాట్లాడుతారు . గిరిజన , గ్రామీణ ప్రాంతాలకు చెందినా ఇక్కడి స్త్రీలు స్వతంత్రులుగా నిష్కపటం గా ఉంటారు .ఇక్కడి అనేక పురాతన దేవాలయాల లో దేవత ను ఆరాధించటం ఇక్కడి వారు అనాదిగా స్త్రీకి ఇచ్చిన విలువను తెలియచేస్తుంది .

గ్రామీణ సమాజం లో కొంత భాగం మంత్రవిద్య ను నమ్ముతారు . అనేక తెగల ప్రజలు ఇక్కడ నివసిస్తారు .సెయింట్ వల్లభాచార్య పుట్టిన ప్రదేశం కావటం వల్ల చంపారణ్ గుజరాతి సమాజం లో మెల్లగా ప్రఖ్యాతి గడిస్తున్నది. ఈ రాష్ట్రము ఒరిస్సా తో కలిసే ప్రదేశాలలో ఒరియా సంస్కృతీ ని చూడవచ్చు . కొస సిల్క్ చీరలు మరియు సల్వార్ సూట్ లు దేశం అంతటా పేరు గడించినవి . పంతి , రావట్ నచ, కర్మ , పంద్వని , చైత్ర , కక్సర్ వంటివి స్థానిక నృత్య రూపకాలు . ఇక్కడి ప్రజలు నాటక రంగం అంటే అభిమానం కనబరుస్తారు . 'రైస్ బౌల్ అఫ్ సెంట్రల్ ఇండియా ' గా పిలువబడే ఛత్తిస్గర్హ్ లో బియ్యం మరియు బియ్యపిండి ని సంస్కృతిక మరియు గిరిజన వంటకాల లో వాడతారు .

స్థానిక మిఠాయి లు కూడా పెరుగాదించాయి . ఇక్కడి నగర వాసులు పవర్ , స్టీల్ , అల్యూమినియం మరియు అడవులు , ఖనిజాల కు సంభందిచిన పారిశ్రామిక రంగాలలో పని కలిగి ఉన్నారు . విద్య పరంగా కూడా ప్రగతి శీలం గా ఉన్న ఈ రాష్ట్రము లో అనేక విద్య సంస్థలు ఛత్తీస్గర్హ్ లో అనేక చోట్ల ఉన్నాయి .

 

చత్తీస్ గర్హ్ ప్రదేశములు

  • ధంతరి 9
  • జంజ్గిర్-చంప 13
  • జగదల్పూర్ 27
  • భిలాయ్ 7
  • జష్పూర్ 19
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun