Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చుర చాంద్ పూర్

చుర చాంద్ పూర్ - సాంస్కృతికంగా విభిన్నమైనది, ఆర్థికంగా ముఖ్యమైనది

6

చుర చాంద్ పూర్ , ఇది మణిపూర్ లో అతిపెద్ద జిల్లా ప్రధానకేంద్రం. స్థానికంగా పట్టణాన్ని'లంక' అని పిలుస్తారు. లంక అంటే 'ఒక రోడ్డు కూడలి వద్ద ఉన్న స్థలం' అని అర్థం. లంక అనే మాట మణిపూర్ పదాలనుండి వొచ్చింది, 'లం' అంటే 'దారి' అని అర్థం మరియు 'క' అంటే 'కూడలి' అని అర్థం. చిన్న కొండలు మరియు లోయలు చుట్టూరా ఉన్న ఈ జిల్లా చాలా అందంగా ఉంటుంది. ఇది రాష్ట్ర రాజధాని అయిన ఇంఫాల్ నుండి 59 కిలోమీటర్ల అవతల ఉన్నది.

చుర చాంద్ పూర్ లో మరియు చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు ఖుగా ఆనకట్ట, ఇది ఒక ప్రముఖ పిక్నిక్ స్పాట్, టుఇబుఒంగ్ వద్ద గిరిజన సంగ్రహాలయాలు మరియు తన్గజాం రహదారి, ణ్గలొఇ జలపాతం వంటి కొన్ని ప్రముఖ ప్రదేశాలు చురచంద్పూర్ పర్యటనను ఆసక్తికరంగా చేస్తున్నాయి. ఈ పట్టణంలో షాపింగ్ చేయకపోతే పర్యటన పూర్తి కాదు. ఇక్కడ షాపింగ్ లో హస్త మరియు దేశీయ కళా వొస్తువులను జ్ఞాపకాలుగా తీసుకెళ్ళకపోతే పర్యటన పూర్తి కాదు.

చురచాన్ద్పూర్, ఇంఫాల్ తర్వాత మణిపూర్ లో రెండవ అతిపెద్ద పట్టణం మరియు ఇది గత కొన్ని దశాబ్దాలుగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నది. ఇది ఒక శాంతియుత పట్టణం అవటంవలన ఇక్కడ మణిపూర్ లో ఉన్న అన్ని వర్గాల ప్రజలు స్థిరపడుతున్నారు. సిమ్తే, పైటే, గంగ్టే, హ్మార్, జౌ, వైఫెఇ, ళుసెఇ మరియు సుక్తే (తెడిం ), సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ప్రజలు ఇక్కడ శాంతియుతంగా జీవిస్తున్నారు.

ప్రజలు మరియు వారి జీవన విధానం ఇదివరకు, చురచాన్ద్పూర్ జిల్లా, కొన్ని గ్రామాల కలియికగా ఉండేది. ఇక్కడ వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉండేది. ఈరోజున, వ్యవసాయం ముఖ్య జీవానాధారమైనా , ఈ పట్టణం రాష్ట్ర ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉన్నది. ఇక్కడ చేనేత మరియు జంతుపెంపకం వంటివి ముఖ్య జీవనాదారాలుగా ప్రజలు జీవిస్తున్నారు.

యుద్ధ ప్రభావానికి దెబ్బతిన్నది కానీ పునర్నిర్మించబడిన చురచాన్ద్పూర్

జపనీస్ నార్త్ ఈస్ట్ గుండా భారతదేశం ప్రవేశించినప్పుడు, చురచాన్ద్పూర్, భారీ బాంబు దాడిని చవి చూసిన పట్టణాలలో ఒకటి. పట్టణం పూర్తిగా నాశనం అయింది, కానీ తరువాతి యాభై సంవత్సరాలలో దీనిని పూర్తిగా పునర్నిర్మించారు మరియు మణిపూర్ లో ఇది ఒక శాంతియుత పట్టణంగా పేరు వొచ్చింది.

చురచాన్ద్పూర్ ఎలా చేరుకోవాలి?

చురచాన్ద్పూర్ సమీపంలో విమానాశ్రయం ఇంఫాల్ వొద్ద సుమారు 59కి. మీ. దూరంలో ఉన్నది. రైలు ద్వారా ప్రజలు డిమాపూర్ లేదా జిరిబం వరకు ప్రయాణం చేయవచ్చు. రోడ్ మార్గం ద్వారా ఈ పట్టణం రాష్ట్ర ఇతర ప్రదేశాలకు బాగా అనుసంధించబడి ఉన్నది.

ప్రయాణానికి ఉత్తమ సమయం

చురచాన్ద్పూర్ సందర్శించటానికి అక్టోబర్ మరియు మార్చ్ నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది.

బిష్ణుపూర్ ఎలా చేరుకోవాలి?

వాతావరణం మణిపూర్ లోని మిగతా ప్రాంతాల వలెనె, చురచాన్ద్పూర్ కూడా ఒక మోస్తరు మరియు ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతను కలిగి ఉన్నది.

చుర చాంద్ పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చుర చాంద్ పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చుర చాంద్ పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చుర చాంద్ పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం:టెదిమ్ రోడ్ అని పిలువబడే నేషనల్ హైవే 150 ఇంఫాల్ - చురచాన్ద్పూర్ ను కలుపుతున్నది. ఈ రోడ్, పట్టణానికి మరియు తరువాత జిల్లాకు జీవనాడిగా పనిచేస్తున్నది. పర్యాటకులు ఇంఫాల్ నుండి ఇక్కడకు రాష్ట్ర ఆధ్వర్యంలో నడిచే బస్సుల ద్వారా గాని లేదా ప్రైవేట్ వాహనాలు అద్దెకు తీసుకొనే గాని చేరుకోవొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ పట్టణం బాగా అనుసంధించబడింది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ మార్గం : జిరిబం వద్ద నారో గేజ్ రైల్వే స్టేషన్ తప్ప మణిపూర్ ఎటువంటి రైల్వే స్టేషన్ కలిగి లేదు, పర్యాటకులు ఇక్కడికి చేరుకోవాలంటే మొదట దిమాపూర్ చేరుకోవలసిందే. దిమాపూర్ జిల్లా ప్రధాన కేంద్రం నుండి 174 కి. మీ. దూరంలో ఉన్నది, జిరిబం 252 కి.మీ. అవతల ఉన్నది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం: చురచాన్ద్పూర్ కు ఏ విమానాశ్రయం లేదు మరియు సమీపంలో విమానకేంద్రం 59 కిలోమీటర్ల దూరంలో, ఇంఫాల్ లో ఉన్నది. ఇంఫాల్ భారతదేశంలోని అన్ని ప్రముఖ విమానయాన సంస్థలకు బాగా సేవలు అందిస్తున్నది. కోలకతా, ఢిల్లీ, బెంగుళూర్ మరియు ముంబై నుండి ఇంఫాల్ కు ప్రతిరోజూ విమానాలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు నేరుగా రోడ్ మీద చురచాన్ద్పూర్ చేరుకోవడానికి విమానాశ్రయం నుండి ప్రీపెయిడ్ టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun