దుబరే ప్రయాణంలో పర్యాటకులు హారంగి డ్యామ్ ను కూడా తప్పక చూడాలి. ఇది దుబరే అడవిలోని కావేరి ఉపనదిపై కలదు. ఈ డ్యామ్ కుషాల్ నగర్ సమీపంలో ఉంటుంది. దీని పొడవు షుమారు 846 మీ.లు కాగా ఎత్తు 47 మీ.లుగా ఉంటుంది.
ఎంతో ప్రశాంత వాతావరణంలో ఈ డ్యామ్ కలదు. ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలలో పర్యాటకులు ఈ డ్యామ్ వద్ద అందమైన రిజర్వాయర్ నిండుగా ఉండటం చూస్తారు. హారంగి డ్యామ్ వద్ద పర్యాటకులకు అతిధి గృహాలు లభిస్తాయి. వీటిని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది.
పూర్తి ప్రశాంతతతో ఈ ప్రదేశం పర్యాటకులకు హాయి కలిగిస్తుంది. ఎపుడు చూసినా పర్యాటకులు కొద్ది సంఖ్యలోనే ఉంటారు కాబట్టి మరింత సౌకర్యం కలిగి ఉంటుంది.