ఈ పార్క్ ని పర్యటించే పర్యాటకులకు ముఖ్య ఆకర్షణ రివర్ రాఫ్టింగ్. అందమైన కోసీ నదిలో రాఫ్టింగ్ లేదా వైట్ వాటర్ రాఫ్టింగ్ అందుబాటులో ఉన్నాయి. ఈ నదిని రాఫ్టింగ్ కి సురక్షితమైనదిగా భావిస్తారు. ఈ నదీ తీరాన ఉన్నటువంటి అనేక రిసార్ట్ లు ఈ రాఫ్టింగ్ కి కావలసిన సామగ్రిని సరసమైన ధరలకు అందిస్తాయి. ఈ నది చుట్టూ అద్భుతమైనటువంటి పర్వతాలు, పర్వత శ్రేణులు ఎంతో అందంగా ఉంటాయి. ఖీర్, టేకు, సాల్ మరియు రోజ్ వుడ్ వంటి చెట్లు ఈ నదీ తీరాన పచ్చదనన్ని నింపుతాయి.
కోసి నది చుట్టూ ఉండే అనేక రిసార్ట్ లు వివిధ ధరలలో రాఫ్టింగ్ ని అందిస్తాయి. సుమారుగా ఒక వ్యక్తికి ఒక రాత్రికి 2000 రూపాయలు వసూలు చేస్తారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు కి రాఫ్టింగ్ కి అనువైన సమయం. అంతే కాకుండా రివర్ క్రాసింగ్ , రాక్ క్లైంబింగ్, రాప్పెల్లింగ్ వంటి సాహస క్రీడలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు.