అనుభవజ్ఞులైన గైడ్లతో ఈ పార్క్ లో చేసే ట్రెక్కింగ్ ఒక గొప్ప అనుభవాన్ని మిగులుస్తుంది. కార్బెట్ టైగర్ డెన్ రిసార్ట్ ప్రతి శరత్ కాలం, వసంత కాలం మరియు చలికాలాలలో ట్రెక్కింగ్ పాకేజ్ ల ను పర్యాటకులకు అందిస్తుంది. కుమేరియా నుండి నైనిటాల్ వరకు 450 మీటర్ల నుండి 2500 మీటర్ల ఎత్తు వరకు ఉండే వైవిధ్యాలతో ట్రెక్కింగ్ ని చేయవచ్చు.
ఈ దారిలో బర్డ్ వాచింగ్ అవకాసం పర్యాటకులకు లభిస్తుంది. పచ్చని ప్రక్రుతి అడవులు, నదులు, కాలువలు ఉన్న ఈ దారిలో ట్రెక్కింగ్ మరపురానిది. చలికాలం ట్రెక్కింగ్ కి అత్యంత అనువైనది గా భావిస్తారు.