కొవ్ లాంగ్ లోని కేథలిక్ చర్చి ప్రధాన ఆకర్షణ. దీనిని వలసరాజ్య పాలన మొదటి రోజులలో నిర్మించారు. కాలం ఇంత మారినా నేటికి ఈ చర్చి ఒక చిహ్నంగా నిలిచిపోయింది. ఈ చర్చి బ్రిటిష్ వారి పాలన మొదటిలో నే నిర్మించబడి చరిత్ర లోని అనేక సంఘటనలకు సాక్ష్యం గా నిలిచింది. భక్తులు ఈ చర్చి కి అధిక సంఖ్య లో వస్తారు. ఈ చర్చి గోపుర నిర్మాణం ఈ గ్రామం లో ఒక పెద్ద గుర్తుగా చెప్తారు. దీని శిల్ప శైలి అద్భుతం గా వుంది నేటి వరకూ కొవ్ లాంగ్ కు గల చరిత్ర లోని స్థానాన్ని నిలుపుతోంది.