Search
  • Follow NativePlanet
Share

కడలూర్ – సముద్రం, దేవాలయాల భూమి!

23

బంగాళాఖాతం తీరంలో ఉన్న కడలూర్ తమిళనాడులో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. కడలూర్ అంటే తమిళంలో “సముద్ర పట్టణం” అనే అర్ధం, ఈ పట్టణం నిజంగానే అందమైన బీచ్ లతో నిండి ఉంది. ఈ నగరం అద్భుతమైన దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది. కడలూర్ లో పాత పట్టణం, కొత్త పట్టణం అనే రెండు జిల్లాలు ఉన్నాయి.

గేడిలం నది పట్టణం గుండా ప్రవహిస్తూ పాత పట్టణాన్ని కొత్త పట్టణం తిరుపదిరిపులియుర్ నుండి వేరు చేస్తుంది. పాత పట్టణాన్ని మొఘలుల పాలనలో “ఇస్లామాబాద్” గా పిలిచేవారు, ఇప్పటికి ఇక్కడ ముస్లిం ప్రాబల్యం కొనసాగుతుంది. 1748 నుండి 1752 వరకు కడలూర్ ఇంగ్లీష్ స్వాధీన ప్రాంతాల రాజధానిగా కూడా ఉండేది.

కడలూర్ లోను, చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

కడలూర్ పట్టణం అనేక శైవ, వైష్ణవ ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. పాటలీశ్వర దేవాలయం, తిరువహీందిరాపురం దేవాలయం, మంగళ పురీశ్వర దేవాలయం, సుదర్కోజూన్తుతీశ్వర్ దేవాలయం కొన్ని చెప్పుకోదగిన అతి ప్రసిద్ధ ఆలయాలు.

ఈ నగరాన్ని ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థాన౦గా మార్చిన ఇక్కడి అనేక బీచ్ లకు కృతజ్ఞతలు. తమిళనాడులో రెండవ అతి పెద్ద బీచ్ సిల్వర్ బీచ్ కడలూర్ కు దగ్గరగా ఉంది. చారిత్రిక, వాస్తు ప్రాధాన్యత కల్గిన సెయింట్ డేవిడ్ కోట, గార్డెన్ హౌస్ కడలూర్ లో ఇతర చూడదగిన ప్రాంతాలు

వెనుక మళ్లే నీటికి, జల క్రీడలకు ప్రసిద్ది చెందిన పిఛావరంను తప్పక సందర్శిచాలి. ఇవి విస్తారమైన మడ అడవులు కూడా. ఈ ప్రధాన భూభాగం దగ్గరలో పక్షులను తిలకించే వారికి ఒక గొప్ప ఆకర్షణ అయిన చాల దీవులు కూడా ఉన్నాయి.

లిగ్నైట్ గనులు, గడిలం కోట, క్యాపర్ కొండలు, చిదంబరం, శ్రీముష్ణం కడలూర్ లోని ఇతర ఆకర్షణలు. 26వ తేది డిసెంబర్ 2004 లో భారత తీరాన్ని తాకిన సునామి కడలూర్ పై ఒక విధ్వంసకర ప్రభావాన్ని చూపినప్పటికీ, ఈ నగరం చావుకు భయపడకూడదు అనే స్ఫూర్తితో తట్టుకొని నిలబడింది.

చరిత్ర ద్వారా

చారిత్రికంగా కడలూర్ జిల్లాలో “చోళనాడు”, “నాధు నాడు” ఉన్నాయి. ఈ పట్టణం పురాతన కాలం నుండి రేవు పట్టణంగా కొనసాగింది. ఈ పట్టాణాన్ని చారిత్రికంగా డచ్చి, పోర్చుగీసు, ఫ్రెంచి, బ్రిటిష్ తో కూడిన అనేక వలస రాజ్యాలు పాలించాయి.

1758 లో ఫ్రెంచి, బ్రిటిష్ వారి మధ్య ఒక నౌకాదళ యుద్ధం జరిగింది. అమెరికా స్వాతంత్ర్య యుద్ధ కాలం, రెండవ ఆంగ్ల- మైసూరు యుద్ధ కాలంలో కడలూర్ లో అశాంతితో కూడిన పరిస్థితి ఏర్పడింది, దీని తర్వాత చివరికి ఈ పట్టాణాన్ని శాంతి ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వారికి అప్పగించారు. కడలూర్ లోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికి దాని వలస చారిత్రిక గొప్పతనాన్ని కల్గి ఉన్నాయి. బ్రిటిష్ వారు నెలకొల్పిన కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికి కడలూర్ లో ఉన్నాయి.

కడలూర్ చేరడం ఎలా

ఈ నగరానికి చక్కటి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. పాండిచ్చేరి అతి దగ్గరి విమానాశ్రయం కాగా చెన్నై అతి దగ్గరి అంతర్జాతీయ విమానాశ్రయం. కడలూర్ లో దగ్గరి పట్టణాలు, నగరాలను కలిపే రెండు రైలు స్టేషన్లు ఉన్నాయి. కడలూర్ 45 ఏ జాతీయ రహదారిపై ఉండటం వలన చక్కటి రోడ్డు రవాణా సౌకర్యాన్ని కల్గి ఉంది.

కడలూర్ వాతావరణం

కడలూర్ ఒక ఉప ఉష్ణమండల స్థితితో ఒక మోస్తరు వాతావరణాన్ని కలిగిఉంటుంది. అక్టోబర్, మార్చ్ సమయంలో ఈ నగర సందర్శన ఉత్తమమైనది. ఈ సమయంలో ఉష్ణోగ్రత ఆహ్లాదకరంగా ఉండి, పర్యటనకు అనువుగా ఉంటుంది.

కడలూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కడలూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కడలూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కడలూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా NH 45A పై ఉన్న కడలూర్ కు రోడ్డుద్వారా తేలికగా చేరుకోవచ్చు. చెన్నై, సాలెం, త్రిచి, కోయంబత్తూర్, తిరువన్నమలై వంటి సమీప నగరాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూర్ నుండి కొన్ని బస్సులు కూడా ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుద్వారా ఈ నగరంలో తిరుపదిరిప్పులియూర్ స్టేషన్, కడలూర్ పోర్ట్ జక్షన్ అనే రెండు స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి తమిళనాడు లోని అన్ని పట్టణాలకు, నగరాలకు, దక్షిణ భారతదేశం లోని ఇతర పట్టణాలకు కూడా రైళ్ళు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా కడలూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండిచేరీ కడలూర్ కి సమీప విమానాశ్రయం. అయితే, కడలూర్ కి సమీపంలోని చెన్నై విమానాశ్రయం ప్రధాన విమానాశ్రయం. ఇది షుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండే అంతర్జాతీయ, స్థానిక విమానాలు రెండూ నడుపబడతాయి, చెన్నై విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun