రావి నది పై నిర్మించబడిన చమేర ఆనకట్ట, రాష్ట్ర ప్రాణధార గా పరిగణించబడుతుంది. డల్హౌసీ నుండి 35 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ఆనకట్ట, ఈ ప్రాంతంలోని జల విద్యుత్తు ప్రాజెక్టులకు మద్దతిస్తుంది. సరస్సు యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి, దాని నిలకడలేని ఉష్ణోగ్రత.
సరస్సు లో జల జీవనం లేకపోవటం చేత ఇది, కయాకింగ్, రోయింగ్, పడవ ప్రయాణం, తెడ్డు పడవ ప్రయాణం, మోటార్ పడవ ప్రయాణం, చేపల వేట వంటి జల క్రీడలకు ఆదర్శవంతమైనదిగా ఉంది. అంతేకాకుండా, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, ఈ ప్రాంతంలో పడవ-ఇల్లు ప్రయాణాలను మరియు షికారాలను అందిస్తుంది.