హిమాచల్ ప్రదేశ్ లోనే అతి పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఖజ్జి నాగ మందిరం, నాగ దేవత ఖజ్జి కి అంకితం చేయబడింది. చెక్క తో చెక్కిన ఈ ఆలయం, 12 వ శతాబ్దంలో నిర్మించారు.ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ ఇక్కడి మండపం. దీని పైకప్పుకి గొప్పభారతీయ పురాణమైన మహాభారతం లోని కౌరవులు మరియు పాండవుల చిత్రాలు వేలాడుతూ ఉంటాయి.